HomeతెలంగాణPanchayat Raj Election Schedule | మండల, జిల్లాపరిషత్​ ఎన్నికల నిర్వహణకు అడుగులు.. ఓటరు జాబితా...

Panchayat Raj Election Schedule | మండల, జిల్లాపరిషత్​ ఎన్నికల నిర్వహణకు అడుగులు.. ఓటరు జాబితా రూపకల్పనకు షెడ్యూల్ విడుదల

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Panchayat Raj Election Schedule | హైకోర్టు (High Court) ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణలో పంచాయతీరాజ్​ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి.

మండల్ ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP)ల కోసం తాత్కాలిక ఓటర్ల జాబితాలను రూపొందించి, ప్రదర్శించేందుకు తాజాగా (ఆగస్టు 30) రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూల్‌ను ప్రకటించింది.

Panchayat Raj Election Schedule : ఈ తేదీల మధ్య..

సెప్టెంబరు (2025) 6 నుంచి 10 వరకు వివిధ దశల్లో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ కొనసాగనుంది. రాజ్యాంగం (Constitution) లోని 243-K ఆర్టికల్, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగనుంది.

నియోజకవర్గాల వారీగా సకాలంలో ఓటర్ల జాబితాలను ప్రదర్శించేందుకు జిల్లా స్థాయి అధికారులు, సీఈవోలు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.

ఓటర్ల షెడ్యూల్ ఇలా..

  • తాత్కాలిక ఓటర్ల జాబితా ప్రదర్శన : సెప్టెంబరు 6వ తేదీన
  • రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం : సెప్టెంబరు 8వ తేదీన
  • గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా అభ్యంతరాల స్వీకరణ : సెప్టెంబరు 6 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు
  • వచ్చిన అభ్యంతరాల పరిష్కారం : సెప్టెంబరు 9వ తేదీన
  • తుది ఓటర్ల జాబితా ప్రదర్శన : సెప్టెంబరు 10వ తేదీ
Must Read
Related News