తొలి విడతలో ఎన్ని చోట్ల ఏకగ్రీవం అంటే..

తొలి విడ‌త‌లో మొత్తం 189 మండ‌లాల్లో పోలింగ్​ జరుగుతోంది. ఈ మండలాల్లో 3,834 పంచాయ‌తీలు, 27,628 వార్డులు ఉన్నాయి. పోలింగ్​ విధుల్లో దాదాపు ల‌క్ష మంది సిబ్బంది పాల్గొంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క కేంద్రాల పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జరగకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

తొలి విడతలో 395 గ్రామాలు తమ panchayats పాలక వర్గాలను ఏకగ్రీవం చేసుకున్నాయి. ఇక రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవం అయింది. కాగా, తొలి విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. ఇక తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో లెక్క చూపని రూ.8.2 కోట్లు పట్టుబడింది. ఈ నగదును సీజ్‌ చేసినట్లు అడిషనల్​ డీజీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.