అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat elections | గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసి, విజేతలు ఎవరో తెలిసిపోయింది. గెలుపొందిన వారు సంబరాల్లో మునిగిపోయారు. ఓడిన వారు నిరాశలో ఉండిపోయారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో వింతలు చోటుచేసుకున్నాయి.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామంలో పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. మూడో విడతలో జరిగిన పోలింగ్‌లో సర్పంచి అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపును కైవసం చేసుకోవడం గమనార్హం.
Panchayat elections | అధికార పార్టీ మద్దతుదారుపై గెలుపు
ఓట్ల లెక్కింపులో అదిగిరి సాయినాథ్ 712 ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థికి 711 ఓట్లు పోలయ్యాయి. దీంతో సాయినాథ్ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. కాగా, ఓడిన అభ్యర్థి అధికార పార్టీ Congress party బలపర్చిన వ్యక్తి అని తెలిసింది. దీంతో ఎలాగైనా గెలవాలని అధికారులు, పోలీసులతో కలిసి కుట్ర పన్నినట్లు ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా.. విజయం మాత్రం చివరికి సాయినాథ్‌ను వరించింది.