అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | తొలి దశ పంచాయతీ ఎన్నికల (Panchayath Elections) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. రాష్ట్రంలో మూడు దశల్లో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించిన విషయం తెలిసిందే.
తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. శనివారం వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. దీంతో అభ్యర్థులు మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 30న నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది.
Panchayat Elections | కోర్టులో విచారణ
పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా.. 117 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పేర్కొనారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ తిమ్మనోనిపల్లి (Thimmanonipalli) రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. వీటిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Panchayat Elections | అభ్యర్థుల ఏర్పాట్లు
సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) పోటీ చేయడానికి అభ్యర్థులు ఇది వరకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో తమకు మద్దతు తెలపాలని కుల సంఘాల పెద్దలను కలిసి కోరుతున్నారు. ఇంకా నామినేషన్లు వేయకపోయినా తాము పోటీ చేస్తామని సపోర్టు చేయాలని గ్రామంలో పలుకుబడి ఉన్న వారిని కలిసి అభ్యర్థిస్తున్నారు. నామినేషన్లు వేయడానికి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.