అక్షరటుడే, ఇందూరు, ఎల్లారెడ్డి: Panchayat Elections | గ్రామపంచాయతీ రెండో దశ ఎన్నికలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఉభయ జిల్లాల ఎన్నికల అధికారులు Election officials ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్ డివిజన్లోని 7, ఆర్మూర్ డివిజన్లోని ఒక్క మండలానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా తరలొస్తున్నారు. నిజామాబాద్‌లోని మొత్తం 196 గ్రామపంచాయతీలకు గాను.. ఇప్పటికే 38 గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 158 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక 1760 వార్డు స్థానాలకు గాను 674 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1081 స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 2.634 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మేరకు 1476 పోలింగ్ స్టేషనులను ఏర్పాటు చేశారు.
Panchayat Elections | కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఉన్న 153 సర్పంచి, 873 వార్డు స్థానాలకు ఈ విడత పోలింగ్ జరుగుతోంది. 153 సర్పంచి స్థానాల్లో 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 873 వార్డు స్థానాలకు 2655 మంది పోటీ పడుతున్నారు. వీరందరి భవితవ్యాన్ని 1,89,177 మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Panchayat Elections | పక్కా పర్యవేక్షణ..
ప్రతి కేంద్రానికి ఒక పీఓ, ఏపీఓను నియమించారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికి స్టేజ్ 2 రిటర్నింగ్ అధికాతులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు ఉపసర్పంచి ఎన్నిక వరకు ప్రక్రియ అంతా వీరి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. నాలుగు, ఐదు పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక జోనల్ ఆఫీసర్‌ను నియమించారు. ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలకు రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు ఒక్కో ఆఫీసర్‌ను కేటాయించారు .
గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది . భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ సరళని ప్రకటించనున్నారు. సర్పంచి అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డ్ మెంబర్లకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లను కేటాయించారు.
ప్రతి కేంద్రానికి ఒక జంబో బ్యా లెట్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. సర్పంచి, వార్డ్ మెంబర్లకు సంబంధించిన రెండు ఓట్లు ఒకే బాక్స్ లో వేయాలి. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉప సర్పంచి ఎన్నిక చేపడతారు.
19 కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా
కామారెడ్డిలో రెండో విడత జరిగే ఆయా మండలాల్లో పరిధిలోని 19 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టారు. ఆ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏడు మండలాల పరిధిలో ఎనిమిది వందల మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల వివరాలు
- ఎల్లారెడ్డి 31 గ్రామపంచాయతీలకు ఐదు ఏకగ్రీవం 26 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి.
- గాంధారి మండలంలో 45 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవం 29 గ్రామపంచాయతీలో ఎన్నికలు కొనసాగుతున్నాయి.
- నాగిరెడ్డిపేట మండలం 27 గ్రామపంచాయతీలకు ఆరు ఏకగ్రీవం 21 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
- లింగంపేట్ మండలంలో 41 గ్రామపంచాయతీలకు 14 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం 27 గ్రామపంచాయతీలో ఎన్నికలు చేపడుతున్నారు.
- నిజాంసాగర్ మండలంలో 14 గ్రామపంచాయతీలకు ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం 13 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి.
- పిట్లంలో 28 గ్రామపంచాయతీలకు ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా 27 గ్రామపంచాయతీలో ఎన్నికలు కొనసాగుతున్నాయి.
- మహమ్మద్ నగర్ లో 13 గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా 12 గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.