అక్షరటుడే, హైదరాబాద్: Panchayat elections | తెలంగాణ Telangana రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో చేపట్టింది. ఈ క్రమంలో నేటితో తుది దశ ఎన్నికల ఘట్టం పూర్తయింది. మూడో విడతలో మొత్తం 182 మండలాల్లోని 4,159 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. 394 సర్పంచి, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
Panchayat elections | ఇండిపెండెంట్ల హవా..
మొదటి, రెండో దశల విధంగానే మూడో దశలో సైతం కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా విజయం సాధించారు. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2208 స్థానాల్లో కాంగ్రస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 1145 మంది భారాస మద్దతుదారులు, 239 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ప్రధాన పార్టీలకు ఏమీ తీసిపోకుండా 488 మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు.
తెలంగాణ వ్యాప్తంగా 12,776 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగగా.. 6782 స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 3500 భారాస మద్దతుదారులు , 695 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 1651 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.