అక్షరటుడే, ఇందూరు : MP Arvind | కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సింబల్ లేని ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
MP Arvind | ఆర్వోబీకి నిధులిచ్చిన డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు..
ఆర్వోబీలకు సంబంధించి నిధులు విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Deputy CM Batti Vikramarka) ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. మరో పది రోజుల్లో అడవి మామిడిపల్లి పనులు పూర్తవుతాయని, మాధవనగర్ వద్ద పనులు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. బోధన్‌లో రెండు పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) చిత్తశుద్ధితో దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా అర్సపల్లి ఆర్వోబీ కోసం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు.
MP Arvind | ఫీజ్ రీయింబర్స్మెంట్..
బీసీలకు ఫీజ్ రీయింబర్స్‌మెంటే ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు (BC Reservations) ఏం ఇస్తుందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. ఇదంతా రాజకీయ డ్రామా అని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని 17శాతం మాత్రమే కేటాయించిందన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతనకర్ లక్ష్మీనారాయణ, న్యాలంరాజు, తదితరులు పాల్గొన్నారు.