అక్షరటుడే, బోధన్: Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాల జోరు సాగుతోంది. బోధన్ (Bodhan), సాలూర, రెంజల్ మండలాల్లో బుధవారం పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
Local Body Elections | నామినేషన్ల ఉపసంహరణ కావడంతో..
నామినేషన్ ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బోధన్ మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలు (Sarpanch posts), వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మావంది కలాన్‌లో సర్పంచ్ స్థానానికి శకుంతల, పెంటాకుర్థు క్యాంప్‌లో వేములపల్లి రాధిక, పెంటాకలాన్లో కర్లం కళావతి, భూలక్ష్మీ క్యాంప్‌లో కామిరెడ్డి బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అలాగే సాలూర మండలంలో (Saloora mandal) మూడు గ్రామాలు సైతం ఏకగ్రీవం చేశారు. సాలంపాడ్‌లో సర్పంచ్ స్థానానికి శీలం నర్మద, ఫతేపూర్‌లో షేక్ నూరా హైమద్, సాలూర క్యాంప్ సర్పంచ్‌గా దొండేటి విజయభాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా రెంజల్ మండలంలోని దండిగుట్ట గ్రామంలో ధనుంజయ్‌ను ఎన్నుకున్నారు. పలు గ్రామాల్లో వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.
