అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) సందడి మొదలైంది. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ క్రమంలో సర్పంచుల ఎన్నిక నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ (Panchayat Raj Rural Development Department) కమిషనరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది.
పంచాయతీ ఎన్నికలపై పలువురు కోర్టులను ఆశ్రయించారు. రిజర్వేషన్లు, ఇతర అంశాలపై పిటిషన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు (election process) ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లాలతో లీగల్ సెల్ సమన్వయం చేయనుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (district election officers), జిల్లా పంచాయతీ అధికారులు 24 గంటలకు మించకుండా, అదనపు అడ్వకేట్ జనరల్ / ప్రభుత్వ ప్లీడర్ (నాన్-సర్వీసెస్) కు సూచనలను సమర్పించి, ఈ కార్యాలయానికి ఒక కాపీని నమోదు చేయాలి. కోర్టు కేసులు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించాలన్నారు. లీగల్ సెల్ సభ్యులుగా కిషన్ సింగ్, మాధురి లత, క్రాంతి కిరణ్ వ్యవహరించనున్నారు.
Panchayat elections | ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ సూచనలు
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఎన్నికల కమిషన్ (Election Commission) పలు సూచనలు చేసింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేయాని సూచించింది.