అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat Elections | గ్రామపంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) రెండో విడత ప్రచార పర్వం ముగిసి రేపు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్నిరకాల అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మందు Liquor, విందు, డబ్బులు ఎరచూపి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.
Panchayat Elections | మద్యం, నగదు..
రెండో విడత పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శనివారం రాత్రికే సర్పంచి, వార్డు స్థానాల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిని మొదలెట్టారు.
రెండో విడత ప్రచార పర్వం శుక్రవారం సాయంత్రం ముగియడంతో పల్లెల్లో ప్రచార సందడి సద్దుమణిగింది. కానీ, అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. ఓటర్లకు మందు, విందులు ఏర్పాటు అభ్యర్థులు బిజీ అయ్యారు. కొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకేశారు.
పోలింగ్‌కు కొన్నిగంటలు మాత్రమే ఉండటంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మద్యం బాటిళ్ల పంచుతున్నారు. కూల్ డ్రింక్‌లు ఎరవేస్తున్నారు. ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.
Panchayat Elections | న్యాల్కల్లో..
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి ఇంటింటికి డబ్బులు cash పంచుతూ కెమెరాకు చిక్కారు. ఏకంగా సంచిలో నగదు కట్టలు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతుండటం గమనార్హం. ప్రతి ఇంటికి వెళ్లి డోర్ కొట్టి, ఇంట్లోని వారిని పలకరించడం.. ఆ ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారో లెక్కించి ఓటుకు ఇంత అంటూ నగదు పంచడం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ గ్రామం ఉంది. అలాంటి ఈ పల్లెలో మద్యం ఏరులై పారుతోంది. అభ్యర్థులు నగదును విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. అయినా కూడా పోలీసులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.