17
అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. చాలా మంది ఔత్సాహికులు సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ పడేందుకు సమాయత్తం అవుతున్నారు. పాత వారితోపాటు యువత సైతం బరిలో నిలిచేందుకు సై అంటోంది.
కాగా, పోటీ చేసే వారికి భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు రూపొందించింది. అవేంటో ఓసారి తెలుసుకోవాల్సి ఉంది. లేకుంటే బంగపాటు తప్పదు.
సర్పంచి పదవికి పోటీచేసేవారు సదరు గ్రామపంచాయతీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాల్సి ఉంది. వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులు పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఓటరుగా నమోదవటంతోపాటు బరిలో నిలిచే వార్డు పరిధిలోని ఓటరు ప్రతిపాదించాలి.
Panchayat elections | వీటిని సరిచూసుకోవాలి..
- వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
- వయస్సు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసేవారు ఆ గ్రామ ఓటర్ లిస్టులో ఓటరుగా నమోదయి ఉండాలి.
- వార్డు సభ్యుడిగా పోటీ చేయాలంటే.. సదరు అభ్యర్థి ఆ గ్రామంలోని ఓటరు జాబితాలో ఓటరుగా నమోదయి ఉండాలి.
- అదే వార్డులో నమోదయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ, బలపరిచే అభ్యర్థి మాత్రం అదే వార్డులో ఓటర్‌గా నమోదయి ఉండాలి.
- సర్పంచి అభ్యర్థిని బలపరిచే వ్యక్తి ఆ గ్రామంలోని ఏదో ఒక వార్డులో ఓటరుగా నమోదయి ఉండాలి.
- సర్పంచి స్థానానికి పోటీ చేసే అభ్యర్థి, వార్డులకు పోటీచే అభ్యర్థులతో పాటు బలపరిచేవారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచిఇ పంచాయతీకి ఎటువంటి బకాయిలు లేవు, అని NO DUES సర్టిఫికెట్ పొంది నామినేషన్ పత్రంతో జతపరచాలి.
- నేర చరిత్ర, ఆస్తుల వివరాల, ఆఫిడవుట్లో ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. వారిద్దరూ అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. వారి ఆధార్ కార్డులు జిరాక్స్‌తో పాటు వారు ఓటరు లిస్టులో ఓటర్లుగా నమోదయి ఉన్నరా.. లేదా.. చూసుకోవాలి.
- ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ వ్యక్తులు అభ్యర్థులుగా పోటీ చేయాలంటే వారి కులం సర్టిఫికెట్ జతపరచాలి.
- జనరల్ వార్డు లేదా జనరల్ గ్రామపంచాయతీలో పోటీ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వారి కులం సర్టిఫికెట్ జతపరిచినప్పుడు మాత్రమే డిపాజిట్లో మినహాయింపును పొందుతారు. లేనటయితే వారు కూడా జనరల్ అభ్యర్థులుగా పరిగణించబడి మొత్తం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
- కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి.
- అభ్యర్థి, బలపరిచే వ్యక్తి, సాక్షుల యొక్క ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జతపరచాలి.
- ఎలక్షన్ ఖర్చులు చూపిస్తానని డిక్లరేషన్ ఫారం అభ్యర్థులు తప్పనిసరిగా నింపాలి.
- విద్యార్హతలు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) జత చేయాలి.
- నామినేషన్ పత్రం (ఫామ్ 3)లో అన్ని కాలమ్స్ నింపి ఇవ్వాలి.
- పోటీ చేయు అభ్యర్థి ఆస్తుల యొక్క స్వీయ ప్రకటన ఇద్దరు సాక్షుల సంతకాలతో పూర్తి చేసి ఇవ్వాలి.
- స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన (అఫిడవిట్)ను నామినేషన్ పత్రంతో పాటు దాఖలు చేయాలని ఎన్నికల నియమావళి చెబుతోంది.
- అభ్యర్థి తనతో పాటు కుటుంబ సభ్యులైన భార్య/భర్త, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలను అఫిడవిట్లో పొందుపరచాలి.
- కుమార్తెకు వివాహమైతే ఆమె వివరాలు ప్రస్తావించాల్సిన పనిలేదు. కుమారుడికి పెళ్లి అయితే కోడలికి సంబంధించిన వివరాలు వెల్లడించాలి.
- కుమారుడు-కోడలు వేరుగా నివసిస్తుంటే వారి వివరాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
- గడులు ఖాళీగా వదలరాదు.
- అందులో తనకు వర్తించదని లేదా నదారత్ అని రాయాలి. లేకుంటే Nomination తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది.
- (స్వీయ ధ్రువీకరణ తప్పుగా ఇచ్చినట్లు రుజువైతే క్రిమినల్ కేసు నమోదవుతుందని ఎన్నికల నియమావళి స్పష్టం చేస్తోంది.)
Panchayat elections | అర్హులు ఎవరంటే..
- రేషన్ డీలర్లు, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు, సహకార సంఘాల సభ్యులు పోటీచేయొచ్చు.
- ఒక వ్యక్తి ఒక పదవికి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రం సమర్పించవచ్చు.
- Nomination దాఖలు సమయంలో అభ్యర్థితో కలిపి ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. (Candidate + 2).
- అభ్యర్థి తరఫున ప్రతిపాదకులు సైతం నామినేషన్ నామినేషన్ పత్రం దాఖలు చేయొచ్చు.
Panchayat elections | అనర్హులు ఎవరంటే..
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదం పొందిన తర్వాత పోటీచేయొచ్చు.
- అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పోటీకి అనర్హులు.
- మతిస్థిమితం లేని వ్యక్తులు.. పోటీకి అనర్హులు.
- ప్రతిపాదకుడి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆర్వో నిర్ధారిస్తే Nomination తిరస్కరణకు గురవుతుంది.
- క్రిమినల్ కోర్టు ద్వారా దోషులుగా తేలితే.. ఆరోజు నుంచి ఐదేళ్ల వరకు పోటీకి అనర్హులు.
- ఆరు నెలల జైలుశిక్ష పడిన వ్యక్తులు ఆరోజు నుంచే పోటీకి అనర్హులు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు.
- గతంలో స్థానిక సంస్థల్లో పోటీచేసి ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించనివారు మళ్లీ పోటీకి అనర్హులు.
- దివాలాదారుగా (ఐపీ) న్యాయ 27). నిర్ణయం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి, రుణ విమోచనం పొందని దివాలాదారు పోటీకి అనర్హులు.
- ప్రభుత్వం గుర్తించిన గుత్తేదారు (Licenced Contractor ) పోటీచేయరాదని ఎన్ని కల నిబంధనావళి చెబుతోంది.