అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat elections | రెండో విడత పంచాయతీ ఎన్నికలు (panchayat elections) ప్రశాంతంగా ముగిశాయి. పలు గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు సజావుగా సాగాయి. మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
రెండో దశలో రాష్ట్రంలోని 193 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 3,911 సర్పంచ్, 29,917 వార్డు స్థానాలకు ఎన్నిక జరిగింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాల్లో భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు (polling stations) తరలి వచ్చారు. దీంతో పోలింగ్ శాతం అధికంగా నమోదు అయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చిన్న జీపీల్లో సాయంత్రం 5 గంటలలోపు ఫలితం తేలనుంది. పెద్ద గ్రామాల్లో రాత్రి వరకు ఓట్ల లెక్కింపు సాగే అవకాశం ఉంది.
Panchayat elections | మొదట వార్డు స్థానాలు..
మొదట వార్డు స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మొదట వేరు చేసి లెక్కిస్తారు. అన్ని వార్డుల ఫలితాలు తేలిన తర్వాత సర్పంచ్ ఓట్లు (Sarpanch votes) లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు. వార్డు సభ్యులతో ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించి మెజారిటీ ఆధారంగా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడంతో అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రజలు సైతం ఎవరు గెలుస్తారోనని పోలింగ్ కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు.