Homeతాజావార్తలుRebel Star Prabhas | హ్యాపీ బ‌ర్త్ డే ప్రభాస్.. ఆన్ స్క్రీన్ రెబల్ స్టార్,...

Rebel Star Prabhas | హ్యాపీ బ‌ర్త్ డే ప్రభాస్.. ఆన్ స్క్రీన్ రెబల్ స్టార్, ఆఫ్ స్క్రీన్ డార్లింగ్ హార్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఆయ‌న‌కి మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను అమిత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2002 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్న ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rebel Star Prabhas | పెద్దనాన్న కృష్ణంరాజు న‌ట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ (Rebel Star Prabhas), నేడు తనకంటూ ఓ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించాడు. ఇండస్ట్రీలో “రెబల్ స్టార్”గా మొదలైన ప్రయాణం, ఇప్పుడు “పాన్ ఇండియా ఐకాన్”గా మారింది. కానీ ఈ స్థాయికి చేరడం అంత తేలికైన విషయం కాదు.

Rebel Star Prabhas | ‘ఈశ్వర్’ నుంచి ‘బాహుబలి’ వరకు

2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రభాస్, మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా వెనుదిరిగి చూడలేదు. ప్రతి సినిమాలోనూ కొత్తదనం, కొత్త ప్యాషన్. వర్షం, ఛత్రపతి, బిల్లా, మిర్చి Mirchi వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. కానీ ఆయన జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా బాహుబలి.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Baahubali) కోసం ప్రభాస్ ఐదేళ్ల సమయం కేటాయించాడు. ఆ స్థాయి డెడికేషన్‌తో పని చేసిన హీరోలు అరుదు. ఆయన శ్రమ, ఓపిక, కమిట్‌మెంట్‌ ఫలితమే బాహుబలిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సినిమా తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీనే “బాహుబలి ముందు – బాహుబలి తర్వాత”గా విభజించారు.

Rebel Star Prabhas | వ్యక్తిత్వం – “ఎక్కడున్నా రాజే” అన్న డైలాగ్ నిజం!

ప్రభాస్ గురించి మాట్లాడితే వసూళ్లు, రికార్డులు కంటే ముందుగా ఆయన మనసు గుర్తుకు వస్తుంది. ఫిల్మ్ సెట్‌లో ఎవరికైనా ఆకలి వేస్తే ముందుగా భోజనం పెట్టేది ఆయనే. చిన్న ఆర్టిస్టు నుంచి లైట్ బాయ్ వరకు, దర్శకుడి నుంచి హీరోయిన్స్ వరకు అందరితో సమానంగా ప్రవర్తిస్తాడు.

బాలీవుడ్ స్టార్‌లు (Bollywood stars) సైతం ప్రభాస్ Prabhas ఆతిథ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. “అతను ఒక బెటాలియన్‌కి సరిపడా ఫుడ్ పెడతాడు!” అని హృతిక్ రోషన్, పృథ్వీరాజ్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు చెప్పిన మాటలు ఇందుకు సాక్ష్యం.

Rebel Star Prabhas | దాతృత్వం – మాటల్లో కాదు, చేతల్లో

ప్రభాస్ దాతృత్వం గురించి ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. కరోనా సమయంలో కోట్లలో విరాళాలు ఇవ్వడం, విపత్తుల సమయంలో ప్రభుత్వం పక్కన నిలవడం ఆయనకు సహజం. ఎవరికీ చెప్పకుండానే సైలెంట్‌గా సహాయం చేసే వ్యక్తి ప్రభాస్.

Rebel Star Prabhas | అభిమానుల కోసం జీవించే డార్లింగ్

ప్రభాస్‌కి ఆన్ స్క్రీన్ ఫ్యాన్స్ ఎంతమందో, ఆఫ్ స్క్రీన్ ప్రేమించే వాళ్లు అంతకంటే ఎక్కువ. ఇంటికి వచ్చిన అభిమానులను సైతం భోజనం పెట్టి పంపిస్తాడు. ఆయన దగ్గరకి వెళ్లినవారంతా ఒకే మాట చెబుతారు..“ప్రభాస్ మానవత్వం చూడకముందు, ఆయన స్టార్‌డమ్ గురించి మాట్లాడకండి.”

Rebel Star Prabhas | బర్త్‌డే బ్లాస్ట్ – అప్డేట్‌ల వర్షం

అక్టోబర్ 23 – ప్రభాస్ అభిమానులకైతే పండుగే. ఈ ఏడాది ఆయన బర్త్‌డేకి ఫౌజీ, ది రాజా సాబ్, కల్కి 2 (Kalki 2), స్పిరిట్ Spirit నుంచి వరుసగా అప్డేట్లు రానున్నాయి. ఫౌజీ పోస్టర్ ఇప్పటికే అలజడి రేపింది. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఫస్ట్ సాంగ్ రిలీజ్ కూడా అభిమానుల్లో హైప్ పెంచుతోంది.

ప్రభాస్ ఇప్పుడు కేవలం నటుడు కాదు – ఒక బ్రాండ్, ఒక స్ఫూర్తి. ఆయన సినిమాలు ఎంత పెద్దవైనా, ఆయన హృదయం అంతకంటే పెద్దది. అందుకే ఆయన పేరు వింటే అందరూ ఒకే మాట చెబుతారు –
“ప్రభాస్.. ఎక్కడున్నా రాజే అని!”

Rebel Star Prabhas | అభిరుచులు, ఇష్టాలు

  • హాబీలు: వాలీబాల్ ఆడటం, పుస్తకాలు చదవడం
  • ఫేవరెట్ ఫుడ్: హైదరాబాద్ బిర్యానీ
  • ఇష్టమైన నటులు: రాబర్ట్ డి నీరో, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే
  • ఇష్టమైన దర్శకుడు: రాజ్‌కుమార్ హిరానీ — ఆయన సినిమాలు మున్నాభాయి ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ ప్రభాస్‌కి చాలా ఇష్టమట.
  • ఇష్టమైన పాట: వర్షం సినిమాలోని “మెల్లగా కరగని”
  • ఇష్టమైన పుస్తకం: అయన్ రాండ్ రాసిన ది ఫౌంటెన్‌హెడ్
  • ఫేవరెట్ ట్రావెల్ ప్లేస్: లండన్
  • సింపుల్ లైఫ్, స్ట్రాంగ్ డెడికేషన్ — అదే ప్రభాస్ స్టైల్!

పెద్ద స్టార్ అయినా వినయంగా, ఆత్మీయంగా ఉండే ప్రభాస్, తన ఫ్యాన్స్‌కి రియల్ లైఫ్ ఐకాన్. ఫిట్‌నెస్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ అన్నీ సమతూకంగా చూసుకునే ఈ సైలెంట్ స్టార్ నిజంగా “రెబల్” అనే పేరుకి తగినవాడు!

ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో

ది రాజా సాబ్ (మారుతి దర్శకత్వం),

సలార్ 2: శౌర్యాంగ పర్వం,

స్పిరిట్ (Spirit) (సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం),

ఫౌజీ (హను రాఘవపూడి దర్శకత్వం),

మరియు కల్కి 2 వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

Must Read
Related News