అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలో మంగళవారం పదకొండేళ్ల మోదీ పాలనపై (PM Modi) బీజేపీ నాయకులు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుస్థిర పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామగ్రామాన ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాంచందర్, నవీన్ కుమార్, సుభాష్, ఉదేశ్, శివయ్య, శ్రీకాంత్, రజనీకుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
