అక్షరటుడే, భీమ్‌గల్: Hockey tournament | మండలంలోని పల్లికొండ గ్రామానికి (Pallikonda villag) చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు (state-level hockey competitions) ఎంపికయ్యారు. ఈనెల 8 నుంచి 10వరకు వనపర్తిలో నిర్వహించనున్న ఎస్జీఎఫ్ (SGF) అండర్-17 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు మాలవత్ అఖిల, కొత్తపల్లి శ్రీనిత్ ఎంపికైనట్లు పీడీ చిన్నయ్య తెలిపారు.
Hockey tournament | ఆయా విభాగాల్లో ప్రతిభ..
గత రెండు నెలల్లో వీరితో పాటు జరిగిన వివిధ విభాగాల పోటీల్లోనూ (competitions) పల్లికొండ విద్యార్థులు సత్తా చాటారు. అండర్-14 విభాగంలో ఎర్రోళ్ల ధనాశ్రీ, భూక్యా స్నేహ, బందెల చైతన్య ఎంపికయ్యారు. అండర్-19 విభాగంలో గంధం నక్షత్ర, దేవానపల్లి వర్షిత, పిండి వర్షిణి, మగ్గిడి దీక్షిత, పంగ రాము, మేకల రేవంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Hockey tournament | క్రీడాకారులకు ప్రోత్సాహం..
రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ పల్లికొండ నూతన సర్పంచ్ మనీషా అశోక్ వారికి హాకీ స్టిక్స్‌ను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనురాధ, సీనియర్ ఉపాధ్యాయులు శ్యాం, విఠల్ గౌడ్, ఉప సర్పంచ్ ఏనుపోతుల చిన్న బాలయ్య, వీడీసీ సభ్యులు దేవానపల్లి రాజన్న, వేంపల్లి అశోక్, రావూట్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.