అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kadiyam Srihari | బీఆర్ఎస్ నాయకుడు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Station Ghanpur MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్లా తన మనుగడ కోసం కేసీఆర్ కుటుంబాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం అనంతరం కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఎంపీ ఎన్నికల ముందు పార్టీ ఆయన తన కూతురుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకొని గెలిచారు. అయితే పార్టీ మారడంతో కడియంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కడియంను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల పల్లా రాజేశ్వర్ సైతం కడియంను విమర్శించారు. దానికి స్పందిస్తూ సోమవారం పల్లాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kadiyam Srihari | కొరివి దయ్యం
పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) కొరివి దయ్యం అని కడియం అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కొరివి దయ్యాల వల్ల కేసీఆర్ (KCR) బయటకు రాలేక పోతురని చాలా సార్లు చెప్పారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, పార్టీని ఆ దయ్యాలు భ్రష్టు పట్టిస్తున్నాయని చెప్పారని గుర్తు చేశారు. ఆ కొరివి దయ్యాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకరని విమర్శించారు. తెల్లారి లేస్తే కడియం శ్రీహరిని తిట్టడమే బీఆర్ఎస్ వాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారని మండి పడ్డారు. తన మనుగడ కోసం కేసీఆర్ కుటుంబాన్ని పల్లా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యలు చేశారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్ పక్షాన చేరి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టారన్నారు. బీఆర్ఎస్లో కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) మధ్యలో కొంత గ్యాప్ ఉందన్నారు. వీటాన్నింటికి కారణం పల్లా అన్నారు. అలాంటి వ్యక్తి తన నియోజకవర్గానికి వచ్చి నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజయ్య కంటే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్కువ గ్రామాల్లో తిరిగారన్నారు. రాజయ్య వస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు రావని బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌రెడ్డిని రమ్మంటున్నారని చెప్పారు.