HomeతెలంగాణPothangal Mandal | సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Pothangal Mandal | సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Pothangal Mandal | పోతంగల్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని పీఎస్ఆర్ నగర్ గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Young India Integrated Residential School) మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో, ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హన్మంత్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అభిషేక్, ఉమ్మడి మండలాల యూత్ అధ్యక్షులు చాంద్ పాషా, గంధపు పవన్, కేశ వీరేశం, విఠల్, మాణిక్ అప్ప, మన్సూర్, జుమ్మా ఖాన్,సజ్జత్, రాజు, నబి, దత్తు, దిగంబర్, సంధాని, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News