- Advertisement -
Homeతాజావార్తలుPakistan Army | పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులు: సొంత గడ్డపై బాంబుల వర్షం, 30...

Pakistan Army | పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులు: సొంత గడ్డపై బాంబుల వర్షం, 30 మంది పౌరుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Army | పాకిస్థాన్ సైన్యం సొంత గడ్డపై చేసిన వైమానిక దాడుల్లో దాదాపు 30 మంది పౌరులు మరణించిన ఘోర ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో తిరాహ్ వ్యాలీలోని మాత్రె ధారా గ్రామం(Matre Dhara Village)పై సైన్యం 8 బాంబులు జారవిడిచిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో చిన్నారులు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబాలు తెలిపాయి. దాడిలో అనేక ఇళ్లు నేలమట్టం కాగా, శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Pakistan Army | ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్టేనా?

స‌హాయక చర్యలు ముమ్మరం కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దాడులకు గల ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఉగ్రవాదుల ఉనికి ఉందన్న అనుమానంతోనే దాడులు జరిగాయా? లేక ఇతర మానవ తప్పిదాల వలన పౌరులపై దాడి జరిగిందా? అన్న అంశాలపై చర్చ సాగుతోంది. దాడికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా(Khyber Pakhtunkhwa Province)లో ఇటీవల ఉగ్రవాద చర్యలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్థాన్ సైన్యం ఈ దాడులు నిర్వహించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు అక్కడ 605 ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయని, ఈ దాడుల్లో 138 మంది పౌరులు, 79 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ఒక్క ఆగస్టు నెలలోనే 129 ఉగ్రదాడులు(Terrorist Attacks) జరిగాయని సమాచారం. ఈ ఘటన పాకిస్థాన్ లో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. సొంత దేశం పౌరులపైనే ఇలా బాంబులు వేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదుల నిర్మూలన పేరుతో పౌరుల ప్రాణాలు తీయడం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ ఘటన పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఉగ్రవాదులపై పోరాటం పేరుతో సొంత పౌరుల ప్రాణాలు తీస్తున్న పరిస్థితిపై అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదురయ్యే అవకాశముంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News