- Advertisement -
HomeUncategorizedterror attack | ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం : కేంద్రం కీలక ప్రకటన

terror attack | ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం : కేంద్రం కీలక ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: terror attack: జమ్మూకాశ్మీర్​లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ మారణ హోం వెనుక పాక్ హస్తం ఉందని గుర్తించింది. దీంతో ఆ దేశంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

పహల్గామ్ దాడి నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్)Cabinet Committee on Security (CCS) సమావేశమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

- Advertisement -

పాకిస్తాన్ పౌరులు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, పాక్​తో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. వాఘా-అటారీ సరిహద్దు చెక్​పోస్టును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరులకు వెల్లడించారు.

terror attack : దాడిని ఖండించిన సీసీఎస్..

జమ్మూకాశ్మీర్​లో జరిగిన ఉగ్రవాద దాడిని కేబినెట్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ” ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారికి బుద్ధి చెప్పడంలో భారత్ అవిశ్రాంతంగా పని చేస్తుందని ” మిస్రీ తెలిపారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి, దాని వెనుక ఉన్న కుట్రదారులను జవాబుదారీగా ఉంచాలని సీసీఎస్ నిర్ణయించిందన్నారు. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని చట్టానికి లోబడి శిక్షించడమే కాక, వారికి మద్దతు ఇచ్చిన వారి చర్యలను బహిరంగంగా బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటామని సంకల్పించినట్లు పేర్కొన్నారు.

terror attack : కీలక నిర్ణయాలు..

పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేబినెట్ కమిటీ నిర్ణయించింది. వాఘా – అటారీ సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు మిస్రీ తెలిపారు. అలాగే, పాకిస్తానీ జాతీయులకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్​తో సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడింది. దీనితో సింధు నది, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ (Indus, Jhelum, Chenab, Ravi, Beas , Sutlej)  నుంచి పాక్​కు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. భారతదేశంలో గల పాక్ జాతీయుల వీసాలు తక్షణమే సస్పెన్షన్ చేస్తున్నట్లు చెప్పారు.

పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. సార్క్ వీసా ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా 48 గంటల్లో భారతదేశం విడిచి వెళ్లాలని సూచించారు. పాక్ హైకమిషనర్ కూడా వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. అలాగే, హైకమిషన్​లోని ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గించింది.

ఇస్లామాబాద్​లోని భారత హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించింది. ఇస్లామాబాద్ నుంచి భారత్ తన సలహాదారులను వెనక్కి తీసుకుంది. ఈ పదవులను రద్దు చేసింది. 5 మంది సపోర్ట్ స్టాఫ్ కూడా వెనక్కి పిలిపించనుంది. దేశ భధ్రతా పరిస్థితిని సమీక్షించిన సీసీఎస్.. అన్ని భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News