ePaper
More
    Homeఅంతర్జాతీయంBallistic Missile | బాలిస్టిక్ క్షిపణుల తయారీపై పాక్ దృష్టి.. రహస్యంగా తయారు చేస్తుందన్న అమెరికా...

    Ballistic Missile | బాలిస్టిక్ క్షిపణుల తయారీపై పాక్ దృష్టి.. రహస్యంగా తయారు చేస్తుందన్న అమెరికా నిఘావర్గాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ballistic Missile | పాకిస్తాన్ (Pakistan) తన జిత్తుల మారితనాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికాతో (America) స్నేహం నటిస్తూనే ఆ దేశాన్ని చేరుకునే పదునైన ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. పాకిస్తాన్ అమెరికాను చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (Ballistic Missile) (ICBM)ను చురుగ్గా అభివృద్ధి చేస్తోందని అగ్రరాజ్య నిఘా సంస్థలు గుర్తించాయి. ఇవి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని పేర్కొన్నాయి. మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత పాక్ సైన్యం (Pak army) అణ్వాయుధాలు మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులపై దృష్టి సారించిందని ఫారిన్ అఫైర్స్ నివేదిక వెల్లడించింది. చైనా సాయంతో వీటిని అభివృద్ధి చేసుకోవాలని భాఇంచిందని, ఇవి అమెరికాను చేరుకునేలా అత్యంత సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించేలా రూపొందిస్తోందని పేర్కొంది.

    భారతదేశాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఇస్లామాబాద్ (Islamabad) తన అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అమెరికాను చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ను చురుకుగా అభివృద్ధి చేస్తోందని US నిఘా సంస్థలు గుర్తించాయి. సుదూర లక్ష్యాలను చేరే ఆయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా అమెరికా (America) చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం పాకిస్తాన్ కు ఏర్పడుతుంది.

    Ballistic Missile | ICBM అంటే ఏమిటి?

    ICBM అనేది 5,500 కిలోమీటర్లు (3,400 మైళ్లు) కంటే ఎక్కువ దూరం ప్రయాణించే దీర్ఘ-శ్రేణి క్షిపణి. ప్రధానంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ థర్మోన్యూక్లియర్ వార్ హెడ్లు అణు పేలోడ్లను మోసుకెళ్లేలా దీన్ని రూపొందిస్తారు. ICBMలు సిద్ధాంతపరంగా సాంప్రదాయ, రసాయన లేదా జీవ ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా వాటిని ఎప్పుడూ వినియోగించలేదు. ఆధునిక ICBMలు మల్టీ ఇండిపెండెంట్ రీ ఎంట్రీ వెహికిల్స్ ను కలిగి ఉంటాయి. దీని ద్వారా ఒకే క్షిపణి ఒకేసారి అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగిస్తుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాల వద్ద మాత్రమే ICBMలు ఉన్నాయి. పాకిస్తాన్, అణ్వాయుధ దేశంగా ఉన్నప్పటికీ, ICBM సామర్థ్యం లేని ఏకైక దేశంగా మిగిలిపోయింది.

    మరోవైపు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (Ballistic Missile) తయారు చేయాలని గానీ, కొనుగోలు చేయాలని గానీ చూస్తే.. అగ్రరాజ్యం ఆ దేశాన్ని అణ్వస్త్ర ప్రత్యర్థి దేశంగా గుర్తిస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర కొరియా, చైనా, రష్యాలను అమెరికా అణ్వస్త్ర ప్రత్యర్థి దేశాలుగా గుర్తించింది.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....