HomeUncategorizedJyoti Malhotra | ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాక్ క‌న్ను.. జ్యోతి మ‌ల్హోత్రా అరెస్టుతో కీల‌క విష‌యాలు వెలుగులోకి..

Jyoti Malhotra | ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాక్ క‌న్ను.. జ్యోతి మ‌ల్హోత్రా అరెస్టుతో కీల‌క విష‌యాలు వెలుగులోకి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jyoti Malhotra | భార‌త్ చేతిలో ఎన్నిసార్లు దెబ్బ‌తిన్నా పాకిస్తాన్ (pakistan) బుద్ధి మార‌డం లేదు. స‌రిహ‌ద్దు ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాక్‌.. మ‌న దేశంలో కుట్ర‌పూరితంగా గూఢ‌చారుల‌ను (spies) నియ‌మించుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై దాయాది దృష్టి సారించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ (social media influencer) హిస్సార్‌కు చెందిన‌ జ్యోతి మల్హోత్రాను (jyoti malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ ఏ విధంగా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ను కుట్ర‌లోకి దించుతుందో అధికారులు ఆదివారం బ‌య‌ట‌పెట్టారు.

Jyoti Malhotra | ప్ర‌భావితం చేసే వ్య‌క్తులే టార్గెట్‌..

స‌మాజంలో ప్ర‌భావం చేసే వ్య‌క్తుల‌నే పాకిస్తాన్ టార్గెట్‌గా (pakistan targeting) చేసుకుంటోంద‌ని హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీవోఐ) భార‌తీయ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ (india social media influencer) ద్వారా త‌మ ప‌నిని సులువు చేసుకోవాల‌నుకుంటున్నార‌ని, ఈ క్ర‌మంలోనే వారిపై క‌న్నేశార‌ని తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ముగ్గులోకి దింప‌డం ద్వారా త‌మ త‌మ వాయిస్‌ను జ‌నంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. “ఆధునిక యుద్ధం సరిహద్దులో మాత్రమే జరగదు. PIOలు కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తమ ఉద్దేశాన్ని ముందుకు తీసుకురావడానికి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ఉపయోగిస్తారు. కేంద్ర సంస్థల నుంచి మాకు సమాచారం అందగానే జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశాం. ఆమె అనేకసార్లు పాకిస్తాన్‌ను (pakistan), ఒకసారి చైనాను (china) సందర్శించింది. ఆమె PIOలతో నేరుగా సంప్రదింపులు జరిపింది. మేము ఆమెను 5 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపాం” అని సావన్ మీడియాకు తెలిపారు.

Jyoti Malhotra | ఆపరేషన్​ సిందూర్ త‌ర్వాత సంప్ర‌దింపులు

జ్యోతి నేరుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆప‌రేటివ్స్‌తో(Pakistan intelligence operatives) సంబంధాలు నెరిపిన‌ట్లు గుర్తించిన‌ట్లు పోలీసులు(police) తెలిపారు. భారతదేశం ఆపరేషన్ సిందూర్ (operation sindoor) చేప‌ట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్త‌త‌లు త‌లెత్తిన త‌రుణంలోనూ జ్యోతి మల్హోత్రా (jyoti malhotra) పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్​తో (Pakistani intelligence operatives) సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. “ఆమె ఆర్థిక వివరాలను మేం విశ్లేషిస్తున్నాం. ఇండియా, పాకిస్తాన్ (india – pakistan) ఘర్షణ సమయంలోనూ ఆమె PIOలతో సంప్రదింపులు జరిపింది. ఆమె ఆదాయ వ‌న‌రుల‌కు, ఆమె చేసిన ప్ర‌యాణాల‌కు ఏమాత్రం పొంత‌న కుద‌ర‌డం లేదు. దీనిపైనే అనేక అనుమానాలు వ‌స్తున్నాయి” అని వివ‌రించారు. “వారు (పాక్ ఇంటెలిజెన్స్‌) ఆమెను (జ్యోతి మల్హోత్రా) అసెట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఆమె ఇతర యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సంప్రదింపులు జరిపింది. వారు PIOలతో కూడా సంప్రదింపులు జరిపారు.. ఆమె స్పాన్సర్ చేసిన ట్రిప్‌ల మాదిరిగానే పాకిస్తాన్‌కు వెళ్లేది. పహల్​గామ్​ దాడికి (pahalgam attack) ముందు ఆమె పాకిస్తాన్‌లో ఉంది. ఆమెతో ఇతర వ్యక్తులు కూడా పాల్గొన్నారని మాకు ఆధారాలు లభించడంతో మేం దర్యాప్తు చేస్తున్నాం” అని ఎస్పీ వెల్లడించారు.