Pakistan's eighth blockade | పాక్ అష్ట దిగ్బంధనం.. విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు
Pakistan's eighth blockade | పాక్ అష్ట దిగ్బంధనం.. విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan’s eighth blockade : పాక్​ను భారత్​ అష్ట దిగ్బంధనం చేసింది. ఓ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్​, మరో వైపు ఇండియన్​ ఆర్మీ, ఇంకోవైపు వైమానిక దళం దాడులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి పాకిస్తాన్​కు కాళరాత్రిగా మారింది. ఇదిలా ఉండగా, పాక్​పై బలూచిస్తాన్​ లిబరేషన్​ ఆర్మీ కూడా దాడులు చేస్తోంది. బలూచ్​ దాడిలో 14 మంది పాక్​ సైనికులు హతమయ్యారు.

ఇక ఐఎన్​ఏ విక్రాంత్​ దాడితో కరాచీ పోర్టులో పది నౌకలు ధ్వంసం అయ్యాయి. 1971 తర్వాత అంటే 54 ఏళ్ల తర్వాత పాక్​పై భారత్​ నెవీ దళం దాడి చేస్తోంది. దీంతో పాటు 26 భారత్​ యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. ఓర్మారా పోర్టు పైనా దాడులు జరిగాయి. మరోవైపు లాహోర్‌లోని ఐఎస్‌ఐ ISI ప్రధాన కార్యాలయంపై భారత్​ దాడి చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు పాక్​ దాడులను తిప్పి కొడుతోంది. పాకిస్తాన్​ డ్రోన్లను ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తోంది. భారత్​కు చెందిన అధునాతన రక్షణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎల్​ 70, జడ్​ యూ 23 ఎం ఎం, షిల్క, ఎస్​ 400 వ్యవస్థలను యాక్టివేట్​ చేయడంతో అవి చురుకుగా పనిచేస్తున్నాయి. పాక్​ 50 డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని భారత్​ కూల్చివేసింది.