Terror Attack | ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులు.. అసలు బుద్ధి బయటపెట్టిన పాక్​
Terror Attack | ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులు.. అసలు బుద్ధి బయటపెట్టిన పాక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జమ్మూకశ్మీర్‌ jammu kashmir పహల్గామ్​ ఉగ్రదాడిని pahalgam terror attack ప్రపంచ దేశాలు ఖండిస్తుంటే.. పాక్​ pak మాత్రం తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ pakistan విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చారు. ఇస్లామాబాద్‌లో islamabad అధికారిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పహల్గాంలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు అని అన్నారు.

ఉగ్రదాడి విషయంలో భారత్ Bharat​ తమపై ఎలాంటి చర్య తీసుకున్నా.. ప్రతిస్పందనగా పాక్‌ సైన్యం pak army సిద్ధంగా ఉందన్నారు. భారత్​ ఏదైనా చర్యకు ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సింధు నదీ జలాల విషయంలో భారత ఏకపక్ష నిర్ణయాలను తాము అంగీకరించమన్నారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించడం గమనార్హం.