HomeUncategorizedPakistan's Defense System | పాక్​ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం.. ఆర్థికంగానూ కోలుకోలేని దెబ్బ!

Pakistan’s Defense System | పాక్​ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం.. ఆర్థికంగానూ కోలుకోలేని దెబ్బ!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan’s defense system is weakened : ఆపరేషన్​ సిందూర్ operation sindoor 2​ పేరుతో భారత్‌ చేపట్టిన ప్రతిదాడులతో పాకిస్తాన్‌ అల్లాడుతోంది. పాకిస్తాన్​పై భారత్​ ఇప్పటికే దాదాపు 100 మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్​కు చెందిన 8 మిస్సైల్స్ ను ఇండియన్​ ఆర్మీకి indian army s400 చెందిన ఎస్​ 400 నేలమట్టం చేసింది. పాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్‌ కూల్చేసింది. సర్గోధా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి.

మరోవైపు లాహోర్‌, పెషావర్‌, కరాచీలోనూ భారత్‌ సేన బాంబుల వర్షం కురిపిస్తోంది. పాక్‌ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా ప్రతిదాడులు చేపడుతోంది. కరాచీ పోర్టుపై భారత నేవీ దాడికి దిగింది. పాక్‌కు చెందిన మూడు ఫైటర్‌ జెట్స్‌తో పాటు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసింది.

ఇక, ఇటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోనూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సేనల నడుమ పోరు కొనసాగుతోంది. మరోవైపు జమ్ము టార్గెట్‌గా పాకిస్తాన్‌ డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌తో దాడికి దిగింది. జమ్మూలో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. జమ్మూ, కశ్మీర్, రాజస్థాన్‌, పంజాబ్‌ అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ కొనసాగుతోంది.

Must Read
Related News