అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | పాకిస్తాన్ pakistan దాడులకు తీవ్రమైన ప్రతిచర్య తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. పాక్‌పై వైమానిక దాడుల air strike on pak గురించి విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ vikram misri మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack బదులు చెప్పడానికి భారత్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి చేసిందన్నారు. అయితే పాక్ సామాన్య పౌరులపై దాడులు చేస్తోందన్నారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సెక్టార్లలో సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతోందని పేర్కొన్నారు. పాక్ దాడుల్లో 16 మంది మృతి చెందారని చెప్పారు.
Operation Sindoor | పాక్ దాడులను తిప్పికొట్టాం
భారత్ అతిక్రమణలకు పాల్పడిందంటూ పాక్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. పాక్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ్య సమితి UNOకి అందించామని మిస్రి చెప్పారు. పాకిస్తాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని చెప్పారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 ప్రాంతాల్లో దాడులకు యత్నించిందన్నారు. జలంధర్, లుధియానా, అవంతిపుర, భటిండ, జమ్మూ, భుజ్, అమృత్సర్, ఛండీఘడ్ తదితర ప్రాంతాల్లో దాడికి యత్నించిందని వివరించారు. అయితే భారత్ పాక్ దాడులను తిప్పికొట్టిందన్నారు. పాక్ మిస్సైళ్లను కూల్చేశామన్నారు. ఆ క్షిపణుల శకలాలు పాకిస్తాన్ సైన్యానికి చెందినవిగా తేలిందన్నారు.
Operation Sindoor | ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశాం
భారత్‌పై పాక్ దాడులు చేపటడ్డంతో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టం pak air defence system ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్ దాడితో పాకిస్తాన్ మొదటి తప్పు చేసిందని చెప్పారు. టీఆర్ఎఫ్ TRF పేరును రిజల్యూషన్‌లో పెడితే తొలగించాలని పాక్ పట్టుబట్టిందన్నారు. ఐక్యరాజ్యసమితి టీఆర్ఎఫ్ను నిషేధించాలని చూస్తే పాక్ అడ్డుకుందన్నారు.
టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని పేర్కొన్నారు. తాము చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనిక అధికారులు పాల్గొన్నారని మిస్రీ పేర్కొన్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఆశ్రయం పొందింది పాకిస్తాన్లోనేనన్నారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానేనని గుర్తు చేశారు. మసూద్ అజార్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. పాక్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ్యసమితికి అందించామని చెప్పారు.
