ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్...

    Operation Sindoor | రాఫెల్ జెట్ల కూల్చివేతపై పాక్ ఆరోపణలు అవాస్తవం.. స్పష్టం చేసిన డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ (Dassault Aviation Chairman and CEO Eric Trappier) తోసిపుచ్చారు. పాక్ వాదన పూర్తిగా అసంబద్ధమని, నిరాధారమని పేర్కొన్నారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) ప్రారంభమైన తాజా ఇండో-పాకిస్తాన్ ఘర్షణ సమయంలో.. J-10C మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రయోగించిన PL-15E లాంగ్-రేంజ్​ క్షిపణులను ఉపయోగించి మూడు రాఫెల్స్​తో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం పేర్కొంది. అయితే, పాక్ వాదననలను డసో ఏవియేషన్ చీఫ్ ఖండించారు. అయితే, ఇండియా ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని వెల్లడించారు. అది కూడా సాంకేతిక వైఫల్యం వల్లేనని స్పష్టం చేశారు.

    READ ALSO  PM Modi | భారత ఆయుధాల వైపు.. ప్రపంచ దేశాల చూపు : ప్రధాని మోదీ

    Operation Sindoor | పాక్ ఆరోపణలు నిరాధారం..

    మూడు రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వాదన పూర్తిగా తప్పని, నిరాధారమైనదని.. రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ అధిపతి ట్రాపియర్ తేల్చి చెప్పారు. అయితే, ఇండియా ఒక విమానం కోల్పోయిందని, అది శత్రువులతో సంబంధం లేకుండా జరిగిందని అంగీకరించారు. అధిక ఎత్తులో సాంకేతిక వైఫల్యం కారణంగా ఈ నష్టం జరిగిందని, భారతదేశం ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని (Rafale fighter jet) కోల్పోయిందని స్పష్టం చేశారు.

    ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్​ఫేర్​ వ్యవస్థలు (Spectra electronic warfare systems) ఎటువంటి శత్రు కార్యకలాపాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. డస్సాల్ట్​కు పంపిన విమాన లాగ్​లు కూడా యుద్ధంలో ఎటువంటి నష్టాలను సూచించలేదన్నారు. డస్సాల్ట్ తన విమానాల ఆపరేషన్ నష్టాలను ఎప్పుడూ దాచలేదని ఆయన గుర్తు చేశారు.

    READ ALSO  Indonesia | నౌకలో భారీ అగ్నిప్రమాదం.. సముద్రంలోకి దూకేసిన ప్రయాణికులు

    Operation Sindoor | ఖండించిన భారత్..

    భారత్​కు చెందిన రాఫెల్ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్ చేస్తున్న అసంబద్ధ వాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రాఫెల్ జెట్లను పాకిస్తాన్ వైమానిక దళం కూల్చివేసిందని చెప్పడం సరికాదని భారత రక్షణ కార్యదర్శి ఆర్​కే సింగ్ (Indian Defense Secretary RK Singh) అన్నారు. “మీరు రాఫెల్స్ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించారు. అది కచ్చితంగా సరైనది కాదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియా చేసిన దాడుల వల్ల పాకిస్తాన్​కు తీవ్ర నష్టం వాటిల్లింది. అది మానవ, భౌతిక పరంగా నష్టపోయింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని” అని ఆయన తేల్చి చెప్పారు.

    Operation Sindoor | రాఫెల్ వ్యతిరేక ప్రచారం వెనుక చైనా..?

    రాఫెల్​కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఫ్రాన్స్ విచారణ చేపట్టగా, దీని వెనుక చైనా ఉందని తేలింది. చైనా విదేశీ రాయబార కార్యాలయాల్లోని రక్షణ అటాచ్​లు డస్సాల్ట్ రాఫెల్ జెట్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ఫ్రెంచ్ నిఘా సంస్థ ఇటీవల గుర్తించింది. ప్రపంచ దేశాలు ఫ్రెంచ్ యుద్ధ విమానాలను (French fighter jets) ఎక్కువగా కొనుగోలు చేయవద్దని, బదులుగా చైనా తయారు చేసిన జెట్లను ఎంచుకోవాలని ఒప్పించడానికే ఈ ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది.

    READ ALSO  Pakistan | పాక్​లోనే మసూద్​ అజార్​.. దాయాదీ చెప్పేవన్నీ అబద్దాలేనని మరోసారి తేలిపోయింది..!

    Latest articles

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు (Gold rates)  ప‌రుగులు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    More like this

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు (Gold rates)  ప‌రుగులు...