HomeUncategorizedPakistani woman divorces | భర్తతో విడాకులు తీసుకున్న పాక్​ మహిళ.. కేక్‌ కోసి సెలబ్రేట్‌...

Pakistani woman divorces | భర్తతో విడాకులు తీసుకున్న పాక్​ మహిళ.. కేక్‌ కోసి సెలబ్రేట్‌ చేసిన కూతురు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistani woman divorces husband : పాకిస్తాన్‌కు pakistan women చెందిన ఒక మహిళ తన 30 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంది. కాగా, ఈ విడాకులను ఆమె కుటుంబం వేడుకగా నిర్వహించుకుంది.

దశాబ్దాలుగా భర్త వల్ల వేధింపులకు గురైన ఆమె.. విముక్తి పొందినందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఆమె కూతురు ఫియా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పంచుకుంది. కాగా, ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అదికాస్త వివాదానికి దారి తీసింది.

ఫియా ప్రకారం.. ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టిన దశాబ్దం తర్వాత విడాకులు అయ్యాయి. అనేకసార్లు ఆయుధాలతో తమను బెదిరింపులకు గురి చేసి వేధించినట్లు ఫియా పేర్కొంది.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది భిన్నంగా స్పందించారు. అందరి ముందు ఈ విధంగా విడాకులను వేడుకగా నిర్వహించుకోవడం తప్పని అన్నారు. కొంతమంది ఇస్లామిక్ బోధనలను ఉటంకిస్తూ విడాకులు ఆమోదయోగ్యం కాని చర్య అని పేర్కొన్నారు. అయితే అంతకు మించి చాలా మంది పాజిటివ్​గా స్పందించారు. ఆ మహిళను, తల్లికి సపోర్టుగా నిలిచిన కూతురును అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Must Read
Related News