India Pakistan border | సరిహద్దు నుంచి పాకిస్తాన్​ సేనలు వెనక్కి..స్థావరాలు ఖాళీ చేస్తున్న పాక్​ సైన్యం!
India Pakistan border | సరిహద్దు నుంచి పాకిస్తాన్​ సేనలు వెనక్కి..స్థావరాలు ఖాళీ చేస్తున్న పాక్​ సైన్యం!

అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakistan border : జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) Line of Control (LoC)  వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు భారత్​ సేన బలమైన ప్రతిదాడిని నిర్వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ దళాలు తమ స్థావరాలను వదిలివేసి, జాతీయ జెండాలను తొలగించాయని అధికార వర్గాల సమాచారం. ఇది పాక్​ శ్రేణుల్లో పెరుగుతున్న ఆందోళన, స్పష్టమైన తిరోగమనాన్ని సూచిస్తోంది.

ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు International Border వెంబడి పాకిస్తాన్ సైన్యం బరి తెగించి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా, నౌషేరా, సుందర్‌బానీ, అఖ్నూర్, బారాముల్లా, కుప్వారా Nowshera , Sundarbani , Akhnoor , Baramulla , Kupwara తో సహా అనేక ప్రాంతాలలో భారత సైన్యం నుంచి పాకిస్తాన్ దళాలు తీవ్ర ప్రతీకార కాల్పులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్​ సేనలు వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.