Terror Attack | పాక్ జ‌ర్న‌లిస్టుకు భంగ‌పాటు
Terror Attack | పాక్ జ‌ర్న‌లిస్టుకు భంగ‌పాటు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Terror Attack | భార‌త్‌ Bharatపై అమెరికా America వైఖ‌రిని ప్ర‌శ్నించిందుకు య‌త్నించిన పాకిస్తాన్ జ‌ర్న‌లిస్టు pakistan journalist కు భంగపాటు ఎదురైంది. ప‌హ‌ల్గామ్ దాడిపై మాట్లాడాల‌ని ప్ర‌శ్నించిన పాక్ రిపోర్ట‌ర్‌కు అమెరికా విదేశాంగ ప్ర‌తినిధి టామీ బ్రూస్‌ US Ambassador Tommy Bruce దిమ్మ తిరిగిపోయే స‌మాధాన‌మిచ్చారు. ఈ విష‌యంలో తాము చెప్పేదేమీ లేద‌ని, అప్ప‌టికే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump స్ప‌ష్ట‌మైన వైఖ‌రి వెల్ల‌డించార‌ని గుర్తు చేశారు. టామీ బ్రూస్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండ‌గా, పాకిస్తాన్‌కు చెందిన జ‌ర్న‌లిస్టు రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ అంశాన్ని లేవ‌నెత్తారు. స్పందించిన బ్రూస్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో marco rubio గ‌తంలోనే స్ప‌ష్టంగా చెప్పార‌న్నారు.

Terror Attack | భార‌త్ వెంటే అమెరికా

ఉగ్ర‌వాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త్‌ Bharatకు అమెరికా US అండ‌గా ఉంటుంద‌న్న ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ఆమె గుర్తు చేశారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నారని స్పష్టం చేశారు. పాక్ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు స్పంద‌న‌గా.. “నేను దానిపై వ్యాఖ్యానించడం లేదు. మ‌నం మ‌రో స‌బ్జెక్టు మాట్లాడుకుందాం. ఆ పరిస్థితి గురించి నేను ఇంకేమీ చెప్పను. అమెరికా అధ్యక్షుడు, కార్యదర్శి అన్ని విషయాలు చెప్పారు. డిప్యూటీ సెక్రెటరీ కూడా చెప్పారు. వారు తమ వైఖరిని స్పష్టం చేశారు. చ‌నిపోయిన వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తాను. గాయ‌ప‌డిన వారు కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తాను. ఈ హీన‌మైన దాడికి పాల్ప‌డిన వారికి శిక్ష ప‌డాల‌ని కోరుకుంటాన‌ని” బ్రూస్ అన్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం, గాయపడిన వారి కోలుకోవాలని అమెరికా ప్రార్థిస్తుందని ఆమె అన్నారు.