ePaper
More
    HomeజాతీయంBihar voters list | బీహార్ ఓట‌ర్ల జాబితాలో పాక్ పౌరులు.. స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌లో...

    Bihar voters list | బీహార్ ఓట‌ర్ల జాబితాలో పాక్ పౌరులు.. స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌లో వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar voters list | బీహార్‌లో ఎన్నిక‌ల సంఘం (Election Commission) నిర్వ‌హించిన ఓట‌ర్ల జాబితా స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (Special Intensive Revision)లో కీల‌క విష‌యం వెలుగు చూసింది. పాకిస్తాన్‌కు చెందిన వారి పేర్లు కూడా ఓట‌ర్ జాబితాలో ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది.

    1956లో భారతదేశంలోకి వ‌చ్చిన ఇద్దరు పాకిస్తాన్ మహిళలపేర్లు బీహార్‌లో ఓటర్ల జాబితాలో ఉన్నట్లు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో ఈ విష‌యం వెలుగు చూసింది. వీసా వ్యవధి ముగిసిన తర్వాత కూడా ఇక్క‌డే నివసిస్తున్న వారిపై హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు సందర్భంగా వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి.

    Bihar voters list  | పేర్లు తొల‌గించేందుకు చ‌ర్య‌లు..

    భాగల్పూర్ జిల్లాలో నివాస‌ముంటున్న ఇద్ద‌రు పాక్ మ‌హిళ‌ల (two Pakistani women) పేర్ల‌ను ఓట‌ర్ జాబితాలో గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. “SIR సమయంలో వారి గురించి నాకు తెలిసింది. డిపార్ట్‌మెంట్ నుంచి వ‌చ్చిన లేఖలో ఉన్న పాస్‌పోర్టు నెంబ‌ర్ల‌తో (passport numbers) క్రాస్-చెక్ చేశాను. వారు పాకిస్తానీయుల‌ని తేలింది. అందులో ఒక‌రు ఇమ్రానా ఖానం మాట్లాడే స్థితిలో లేదు. పాకిస్తాన్‌కు చెందిన ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. 1958లో వీసా వచ్చింది. ఆగస్టు 11న నాకు హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటీసు అందింది. డిపార్ట్‌మెంట్ ఆదేశాల ప్రకారం నేను ఫారంను పూరించి, ఆమె పేరును తొలగించే ప్రక్రియను ప్రారంభించాను. ” అని బూత్ లెవల్ ఆఫీసర్ ఫర్జానా ఖానం (Booth Level Officer Farzana Khanam) తెలిపారు.

    Bihar voters list | 60 ల‌క్ష‌ల ఓట్ల తొల‌గింపు..

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly elections) ముందు క్లీన్ ఓటర్ జాబితా కోసం ఎన్నిక‌ల సంఘం స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓట‌ర్లను వెరిఫై చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓట‌ర్ జాబితాలో పేరు ఉండి, స్థానికంగా ఉండ‌ని 60 ల‌క్ష‌ల మందిని గుర్తించి వారి పేర్ల‌ను తొల‌గించారు. అయితే, దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ నెల‌కొంది. బీజేపీతో ఎన్నిక‌ల సంఘం కుమ్మ‌క్కై ఎంపిక చేసిన వారిని మాత్ర‌మే తొల‌గిస్తోంద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌కు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టులో (Supreme Court) ప‌లువురు పిటిష‌న్లు వేశారు. అయితే, ఈసీ చ‌ర్య‌ల‌ను స‌ర్వోన్న‌త‌ న్యాయ‌స్థానం స‌మ‌ర్థించింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో కొనసాగుతోంది.

    Latest articles

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై...

    Drone Attack | రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్​.. అణువిద్యుత్​ కేంద్రంపై డ్రోన్​లతో దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు...

    Vinayaka chavithi | గణపతుల బావి పూడికతీత పనులు ప్రారంభం

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka chavithi | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి మొదలైంది. ఇప్పటికే గణనాథులను...

    More like this

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై...

    Drone Attack | రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్​.. అణువిద్యుత్​ కేంద్రంపై డ్రోన్​లతో దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు...