అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | పాక్ రక్షణ pak defence శాఖపై ఆ దేశ పౌరులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack ప్రతీకారంగా భారత్ పీవోకేతో పాటు పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్ దాడులపై ఆ దేశ పౌరుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే పాక్ అడ్డుకోలేకపోయిందని ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాకుండా పాత వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని, పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో దాడి చేసినా రక్షణ వ్యవస్థ చేసేదేమి లేదన్నారు. ఇజ్రాయెల్‌పై ఎవరైన క్షిపణులు ప్రయోగిస్తే ఆ దేశ రక్షణ వ్యవస్థ వాటిలో ఎక్కువ మట్టుకు కూల్చి వేస్తుందన్నారు. కానీ పాక్ మాత్రం ఒక్క క్షిపణిని కూడా అడ్డుకోలేకపోయిందన్నారు.
