HomeUncategorizedSocial Accounts ban | పాక్ న‌టుల సోష‌ల్ అకౌంట్ల‌పై మ‌ళ్లీ నిషేధం

Social Accounts ban | పాక్ న‌టుల సోష‌ల్ అకౌంట్ల‌పై మ‌ళ్లీ నిషేధం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Social Accounts ban | పాకిస్తాన్‌తో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఆ దేశానికి చెందిన న‌టుల‌పై భార‌త్ మ‌రోసారి నిషేధం విధించింది. గ‌తంలోనే ఆయా సోషల్ మీడియా (Social media) ప్రొఫైల్స్​ను నిషేధించిన‌ప్ప‌టికీ, ఇండియాలో మ‌ళ్లీ కనిపిస్తున్నాయనే వార్త బుధవారం ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలకు గురైంది. హనియా ఆమిర్, మహిరా ఖాన్, సబా ఖమర్, మావ్రా హొకేన్ వంటి అనేక మంది పాకిస్తానీ నటుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ (Instagram Profile) బుధవారం ఇండియాలో కనిపించాయి. ఇది ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. అయితే, గురువారం నుంచి ఆయా సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను (social Media accounts) మళ్లీ నిషేధించారు.

Social Accounts ban | యాక్సెస్ నిషేధం

చాలా మంది పాకిస్తానీ నటుల ప్రొఫైల్స్ (Pakistani Actors Profiles) ఇన్‌స్టాగ్రామ్. ’X’లో గురువారం యాక్సెస్ కాలేదు. ఒక రోజు వ్య‌వ‌ధిలోనే పాకిస్తానీ న‌టుల‌పై నిషేధం మళ్లీ పునరుద్ధరించారు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది, ఫవాద్ ఖాన్, ఫహద్ ముస్తఫా, అహద్ రజా మీర్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే, పాకిస్తానీ ప్రముఖులపై నిషేధాన్ని పునరుద్ధరించడం గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Social Accounts ban | ప‌హల్గామ్ త‌ర్వాత బ్యాన్‌..

జ‌మ్మూకశ్మీర్‌లోని ప‌హల్గామ్ ఉగ్ర‌దాడి (Pahalgam terror attack) త‌ర్వాత ఇరుదేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి. ఆప‌రేష‌న్ సిందూర్ (Operation sindoor) పేరిట భార‌త్.. పాకిస్తాన్‌తో పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావ‌రాల‌పై (terrorist camps) దాడులు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో కేంద్రం పాకిస్తాన్ ప్ర‌ముఖ‌ల‌ ఖాతాలపై నిషేధం విధించింది. ఇండియా దాడులు చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో (Social Media) బహిరంగంగా విమర్శించిన హనియా అమీర్‌తో (Hania Amir) సహా అనేక మంది పాకిస్తానీ గాయకుల ఖాతాల‌ను బ్లాక్ చేశారు. అదే స‌మ‌యంలో పాకిస్తానీ నటులను భారతీయ చిత్రాల నుంచి నిషేధించారు. అయితే, అప్పటికి హనియా అమీర్ దిల్జిత్ దోసాంజ్ నటించిన పంజాబీ చిత్రం సర్దార్ జీ 3 చిత్రీకరించారు. గత నెలలో ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన వెంటనే, సర్దార్ జీ 3 నటీనటులు, నిర్మాతలపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వీటన్నింటి మధ్య, చిత్ర నిర్మాతలు తమ చిత్రాన్ని విదేశీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. భారతీయ మనోభావాలకు అనుకూలంగా భారతదేశంలో విడుదల కాలేదు.

Must Read
Related News