- Advertisement -
HomeUncategorizedInd - Pak | 8 గంట‌ల్లోనే తోక ముడిచిన పాక్‌.. భార‌త దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి

Ind – Pak | 8 గంట‌ల్లోనే తోక ముడిచిన పాక్‌.. భార‌త దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ind – Pak | ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా భార‌త్(Bharath) చేప‌ట్టిన దాడుల‌తో ప్ర‌తీకార దాడుల‌కు దిగిన పాకిస్తాన్‌(Pakistan)కు భార‌త్ చుక్క‌లు చూపించింది. ఆప‌రేష‌న్ బ‌న్య‌న్ అల్ మ‌ర్సూస్(Operation Banyan Al Marsus) పాక్ చేప‌ట్టిన ప్ర‌తీకార దాడి కేవ‌లం ఎనిమిది గంట‌ల్లోనే ముగిసింది. ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)కు వ్య‌తిరేకంగా మే 10న పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బన్యన్ అల్-మర్సూస్ ప్రతీకారం కేవలం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ముగియ‌డానికి కార‌ణంగా భార‌త్ చేసిన దాడులే. మే 10వ తేదీ అర్ధ‌రాత్రి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్(Indian Airforce) చేసిన నాలుగు ప్రధాన వైమానిక దాడులు శత్రువుల వైమానిక స్థావరాలు, వైమానిక ఆస్తులు, వైమానిక రక్షణలను దెబ్బ తీశాయని తాజాగా ఓ నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌త్య‌క్ష సాక్షుల క‌థ‌నాన్ని ఉటంకిస్తూ త‌మ దేశంలోకి చొచ్చుకొచ్చి మ‌రీ వైమానిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేస్తుండ‌డంతో పాక్ వ‌ణికి పోయిందని తెలిపింది. భార‌త్ దాడులు కొన‌సాగితే తాము కోలుకోలేమ‌ని భ‌య‌ప‌డిన దాయాది.. ర‌క్షించ‌మ‌ని అమెరికాను అర్థించిందని పేర్కొంది.

Ind – Pak | క‌చ్చిత‌త్వ‌మైన దాడులు..

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్లు మే 10న పాకిస్తాన్‌(Pakistan)పై నాలుగుసార్లు క్షిపణులతో దాడికి పాల్ప‌డ్డారు. అత్యంత క‌చ్చిత‌త్వంతో పాక్ వైమానిక స్థావరాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడి చేశారు. రాఫెల్ ప్రయోగించిన SCALP క్షిపణులు, SU-30 MKI ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు మొదటి దాడిలోనే చక్లాలాలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం వద్ద ఉత్తర వైమానిక కమాండ్-కంట్రోల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశాయని స్థానికులు వెల్ల‌డించారు. చివరి దాడి జకోబాబాద్, భోలారి వైమానిక స్థావరాలపై జరిగింది, కానీ ఆ సమయానికి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వ‌చ్చి కాల్పుల విరమణ కోసం అమెరికా జోక్యాన్ని అభ్య‌ర్థించింది.

- Advertisement -

Ind – Pak | ఎనిమిది గంటల్లోనే వెన‌క్కి..

కమ్యూనికేషన్ ఇంటర్‌సెప్ట్‌ల నివేదిక‌ల ప్రకారం.. రాబోయే 48 గంటల్లో భారత వైమానిక స్థావరాలను నాశనం చేస్తామని మే 10న తెల్లవారుజామున ఒంటి గంటకు పాకిస్తాన్ ప్రారంభించిన బన్యన్ అల్-మర్సూస్ ఆపరేషన్(Banyan Al Marsus Operation) గంట‌ల వ్య‌వ‌ధిలోనే ముగించేసింది. అది కేవ‌లం ఉదయం 9.30 గంటల వరకు మాత్రమే కొనసాగింది. ఎందుకంటే భారతదేశం వివిధ రకాల ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టింద‌ని నివేదిక వెల్ల‌డించింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో అద‌మ్‌పూర్‌లోని భారతదేశ S-400 వాయు రక్షణ వ్యవస్థ కనీసం 11 సార్లు ప్ర‌తిస్పందించింది. పాకిస్తాన్‌లోని 315 కిలోమీటర్ల లోతు వరకు పాకిస్తానీ SAAB-2000 వాయుమార్గ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను నాశనం చేసింది. C-130 J మీడియం లిఫ్ట్ విమానం, ఒక JF-17, రెండు F-16 యుద్ధ విమానాలను క్షిపణులు కూల్చివేసినట్లు భారత వైమానిక దళం(Indian Air Force) వ‌ద్ద‌ రుజువులు ఉన్న‌ట్లు నివేదిక తెలిపింది. IAF SCALP, బ్రహ్మోస్ రెండింటినీ కలిపి ఉపయోగించడంతో అత్యంత క‌చ్చిత‌త్వంతో లక్ష్యాన్ని ఛేదించింది.

మే 7న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడిలో, ఏడు శిబిరాలపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ వైమానిక దళం, నేవీ క‌లిసి దాడి చేశాయి. మురిడ్కే, బహవల్పూర్‌లోని ఉగ్రవాద కర్మాగారాలను SCALP, బ్రహ్మోస్ క్షిపణులు గైడెడ్ బాంబులు అత్యంత క‌చ్చితత్వంతో ల‌క్ష్యాల‌ను ఛేదించాయి. అయితే, మే 10న లాహోర్‌లో HARPY కామికేజ్ డ్రోన్‌ను ఉపయోగించి చైనాలో తయారు చేసిన LY-80 వైమానిక రక్షణ వ్యవస్థను భారత దాడులు ధ్వంసం చేశాయి, భారతీయ క్షిపణి కరాచీలోని మాలిర్ వద్ద విలువైన HQ-9 (S-300 యొక్క చైనీస్ వెర్షన్)ను ధ్వంసం చేసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News