Pakistan vs South Africa | స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో సౌతాఫ్రికా ‘సీ’ టీమ్ చేతిలో పాక్ ఘోర ఓటమి చవిచూసింది. యువ ఆటగాళ్లతో కూడిన సఫారీ జట్టు తొలి టీ20లో దూకుడుగా ఆడి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఖరారు చేసింది. అయితే, ఆ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాక్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది.
పాకిస్తాన్ Pakistan క్రికెట్ జట్టు స్థాయి రోజురోజుకూ దిగజారుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రభావం చూపలేకపోయిన పాక్, ఇప్పుడు స్వదేశంలోనూ పరాభవాలను చవిచూస్తోంది. ప్రధాన ఆటగాళ్లు లేకుండా ఆడిన దక్షిణాఫ్రికా సీ టీమ్‌చేతులో చిత్తుగా ఓడిపోవడంతో పాక్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టీ20లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది.టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, యువ ఆటగాళ్లతో ఆడిన సౌతాఫ్రికా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఓపెనర్లు రీజా హెన్డ్రిక్స్ (60: 40 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), క్వింటన్ డికాక్ (23: 13 బంతులు, 5 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించారు. మధ్యలో టోనీ డీ జార్జ్ (33) రాణించగా, ఆఖర్లో జార్జ్ లిండే (36) దూసుకెళ్లడంతో సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేశారు. డివాల్డ్ బ్రివీస్ (9), బ్రీట్జ్కీ (1) మాత్రం నిరాశపరిచారు.
Pakistan vs South Africa | కుప్పకూలిన పాక్ బ్యాటింగ్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. చాన్నాళ్ల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన బాబర్ ఆజమ్Babar Azam రెండో బంతికే డకౌట్ కాగా, కెప్టెన్ సల్మాన్ అఘా కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవడంతో ఇన్నింగ్స్ పూర్తిగా కూలిపోయింది. చివర్లో మొహమ్మద్ నవాజ్ (36) పోరాడినా జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయాడు. చివరికి పాక్ జట్టు కేవలం 18.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌట్ అయింది.
సౌతాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కేవలం 4 ఓవర్లలో 14 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. జార్జ్ లిండే 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించిన లిండేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌తో మరోసారి పాకిస్తాన్ జట్టు దారుణ ఫామ్ స్పష్టమైంది. గతంలో టెస్టుల్లో చిత్తయిన పాక్, ఇప్పుడు టీ20ల్లోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది. సీనియర్లు Seniors ఉన్నా, లేకున్నా జట్టు ప్రదర్శనలో మెరుగుదల కనిపించకపోవడంతో పాక్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

