HomeUncategorizedStock Market | పాక్‌ వర్సెస్‌ భారత్‌ స్టాక్‌ మార్కెట్‌.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

Stock Market | పాక్‌ వర్సెస్‌ భారత్‌ స్టాక్‌ మార్కెట్‌.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | అభివృద్ధి(Development)లో ఏ విధంగానూ సరితూగని పాకిస్థాన్‌.. మన దేశాన్ని ఇబ్బందిపెట్టాలని అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటుంది. తాను అభివృద్ధి చెందడం కన్నా.. మనల్ని నష్టపరచడానికే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రత్యక్ష యుద్ధాలలో చావుదెబ్బతిన్నా బుద్ధి మార్చుకోకుండా.. పరోక్షంగా ఉగ్రవాదం(Terrorism)తో దాడులు చేస్తూనే ఉంటుంది. ప్రజలు గోధుమ పిండి కోసం కుట్టుకుంటున్నా.. గోబెల్స్‌(Gobels) ప్రచారంతో భారత్‌(Bharath)పై విషాన్ని కుమ్మరిస్తూనే ఉంటుంది. ఏ విధంగా చూసినా మనకు పాకిస్థాన్‌కు నాగలోకానికి నక్కకు ఉన్నంత తేడా ఉంది. ఇరు దేశాల స్టాక్‌ మార్కెట్లను పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతోంది.

భారత్‌ స్టాక్‌ మార్కెట్‌(Indian stock market)లో 5 వేలకుపైగా కంపెనీలున్నాయి. పాక్‌ మార్కెట్‌లో 500 కంపెనీలు కూడా లేవు.బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం మన దేశ స్టాక్‌ మార్కెట్‌ విలువ సుమారు 5.06 ట్రిలియన్లు(Trillions). అదే పాక్‌ స్టాక్‌ మార్కెటు విలువ 20.36 బిలియన్లు(billions) మాత్రమే. మన మార్కెట్లలో లిస్టయిన కంపెనీలలో 15 కంపెనీలు సంస్థపరంగా పాక్‌ మొత్తం మార్కెట్‌ విలువ(Market cap) కంటే అధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగి ఉండడం గమనార్హం. కేవలం రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ పాకిస్థాన్‌ మార్కెట్‌ క్యాప్‌ కంటే ఐదు రెట్లు ఎక్కువ.

నిఫ్టీ 50 పీఈ(PE) 22 కాగా.. పాకిస్థాన్‌కు చెందిన కేఎస్‌ఈ100 పీఈ 6 మాత్రమే. ఇండియాన్‌ మార్కెట్‌ ప్రైస్‌ టు బుక్‌ రేషియో 3 కాగా.. పాక్‌ది బుక్‌ వ్యాల్యూ వద్దే ఉంది. ఇండియా ఫారెక్స్‌ నిల్వలు(Forex reserves) 688 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. పాక్‌ వద్ద కేవలం 15.25 బిలియన్‌ డాలర్లే ఉన్నాయి.

భారత్‌(India) బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. మన కంపెనీలు సాధిస్తున్న ప్రగతి, స్థిరమైన రాజకీయ వాతావరణం, పారిశ్రామికాభివృద్ధికి అందుతున్న ప్రోత్సాహాలతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ పాకిస్థాన్‌లో అనిశ్చిత పరిస్థితులు, అదుపులో లేని ద్రవ్యోల్బణం, ఫారెక్స్‌ నిల్వల కొరత, వృద్ధి లేకపోవడంతో ఎఫ్‌ఐఐ(FII)లు అక్కడి మార్కెట్‌లో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు.

ప్రపంచంలోని ఈక్విటీ మార్కెట్లలో భారత్‌ ఐదో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌ టాప్‌ 40 జాబితాలోనే చోటు దక్కించుకోలేదు.పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(Pakistan stock exchange)లో లిస్టయిన కంపెనీలలో అతిపెద్దదయిన ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 23 వేల కోట్లు మాత్రమే. ఇది రిలయన్స్‌(రూ. 18.64 లక్షల కోట్లు)లో 1.28 శాతం. బీఎస్‌ఈ(బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) మార్కెట్‌ క్యాప్‌ రూ. 88,969 కోట్లు కాగా.. పీఎస్‌ఎక్స్‌(పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) మార్కెట్‌ క్యాప్‌ రూ. 527 కోట్లు.

Must Read
Related News