More
    Homeక్రీడలుPakistan vs India | జరిగింది మ్యాచే కానీ, పాక్‌కి గట్టిగానే బుద్ది చెప్పిన భార‌త...

    Pakistan vs India | జరిగింది మ్యాచే కానీ, పాక్‌కి గట్టిగానే బుద్ది చెప్పిన భార‌త ఆట‌గాళ్లు!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan vs India | ఆసియా కప్ 2025లో Asia Cup 2025 భాగంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది.

    యువ జట్టుతో బరిలోకి దిగిన భారత జ‌ట్టు అత్యుత్తమ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను చిత్తు చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్‌ – పాకిస్తాన్ Pakistan మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ మ్యాచ్‌ ఆడటంపై కొన్ని వర్గాలు తీవ్ర‌ విమర్శలు గుప్పించాయి.

    అయినప్పటికీ బీసీసీఐ BCCI నిర్ణయంతో మ్యాచ్‌ జరిగింది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత భారత్‌ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తోటి ఆటగాడు శివమ్‌ దూబే.. పాక్‌ ఆటగాళ్లకి షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ల‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

    Pakistan vs India | గ‌ట్టిగా బుద్ది చెప్పారు..

    టాస్ సమయంలో కూడా పాక్‌ కెప్టెన్‌తో సూర్యకుమార్ Surya kumar Yadav హ్యాండ్‌షేక్ చేయకపోవడం, మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థుల‌తో క‌ర‌చాల‌నం చేయ‌కుండా నేరుగా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు వెళ్లిపోయిన తీరు నిరసనగా భావిస్తున్నారు.

    పాక్ ఆటగాళ్లను పూర్తిగా ఇగ్నోర్ చేసినట్లు కనిపించిన ఈ ప్రవర్తనపై అభిమానులు రెండు విధాలుగా స్పందిస్తున్నారు.

    కొంతమంది సూర్య దేశభక్తిని కొనియాడుతుండగా, మరికొందరు క్రీడా స్పిరిట్‌ను ప్రశ్నిస్తున్నారు. మ‌రోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా Pakistan captain Salman Agha ఈ మ్యాచ్‌కు ముందు, ఆ తర్వాత తనకు ఎదురైన అవమానంతో ఫుల్ సీరియ‌స్‌గా ఉన్నాడ‌ట.

    టీమిండియా ఆట‌గాళ్ల‌తో పాటు డగౌట్‌లో కూర్చున్న మిగతా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కూడా పాక్ ఆట‌గాళ్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌లేదు.

    దీనిప‌ట్ల పాకిస్తాన్ కోచ్, కెప్టెన్ చాలా నిరుత్సాహానికి గుర‌య్యారు. కోపంతో కెప్టెన్ ప్ర‌జంటేష‌న్‌కి కూడా రాలేదు.

    ఇక సూర్య అయితే ప్ర‌జంటేష‌న్ Presentation స‌మ‌యంలో పహల్గామ్ బాధితులను గుర్తుచేసుకుంటూ, భారత సైన్యం ధైర్యసాహసాలకు సెల్యూట్ చెబుతూ ఈ విజ‌యం సైన్యం Indian Army, బాధితులకు అంకితం చేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు.

    More like this

    Odisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము పిల్లలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కాకత్‌పూర్(Kakatpur) ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి...

    Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. సింగూరు,...

    Supreme Court | వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై సుప్రీం కీలక తీర్పు.. కొన్ని అంశాలపై స్టే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | వక్ఫ్ (సవరణ) చట్టం 2025పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమ‌వారం...