అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan vs India| ఎన్నో విమర్శల నడుమ జరిగిన భారత్ వర్సెస్ పాక్ Ind vs Pak మ్యాచ్‌లో టీమిండియా విజయభేరి మోగించింది.
అయితే పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack కారణంగా ఈ మ్యాచ్‌ని బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినా.. చివరకు స్టేడియం దాదాపుగా ఫుల్ అవడం, మిలియన్ల మంది టీవీలకు అతుక్కుపోవడం చూసి మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
అయితే మ్యాచ్ కంటే ఎక్కువగా ఇప్పుడు అంపైర్ల నిర్ణయాలపై పాక్ అభిమానుల్లో అసంతృప్తి వెల్లివిరుస్తోంది. మూడు సార్లు అంపైర్స్ ఇండియాకి ఫేవర్‌గా ఔట్ ఇవ్వడం, కానీ డీఆర్ఎస్ DRS లో నాటౌట్‌గా తేలడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Pakistan vs India: పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో వివాదాస్పద DRS ఘటనలు చూస్తే..
1. ఫకర్ జమాన్ vs బుమ్రా Fakhar Zaman vs Bumrah (ఇన్నింగ్స్ 2వ ఓవర్):
జస్ప్రిత్ బుమ్రా వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ, ఫకర్ వెంటనే రివ్యూ తీసుకోగా, బంతి స్టంప్స్‌కి దూరంగా లెగ్ సైడ్‌కి వెళ్తున్నట్లు తేలింది.
2. సల్మాన్ అఘా vs వరుణ్ చక్రవర్తి Salman Agha vs Varun Chakravarthy:
సల్మాన్‌ని కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చారు. వెంటనే రివ్యూ తీసుకోగా, బాల్ ట్రాకింగ్ ప్రకారం బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు నిర్ధారితమైంది.
3. షాహిబ్‌జాదా ఫర్హాన్ vs అక్షర్ పటేల్ Shahibzada Farhan vs Axar Patel (14వ ఓవర్) :
ఫర్హాన్ 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బీడబ్ల్యూగా ఇచ్చిన అంపైర్ నిర్ణయం, రివ్యూలో బంతి స్టంప్‌లను మిస్ అవుతుందని తేలింది.
ఇలా ఒకే మ్యాచ్‌లో తీసుకున్న మూడు రివ్యూలు సక్సెస్ కావడం అరుదైన రికార్డు అంటున్నారు. పాకిస్తాన్ బ్యాటర్లు ఔట్ అయినట్లు ఇచ్చిన 3 నిర్ణయాలు మార్చాల్సి రావడం, ఓ టీ 20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం.
గతంలో ఆస్ట్రేలియా Australia తో జరిగిన మ్యాచ్‌లో ఓమన్ ఇలా 3 సక్సెస్‌ఫుల్ రివ్యూలు తీసుకొని రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు పాకిస్తాన్ దానిని సమం చేసింది.
అయితే ఈ నిర్ణయాలన్నీ భారత్‌కు అనుకూలంగా మారిన తర్వాత, పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో #Cheating ట్రెండ్ చేస్తూ BCCI మీద విమర్శలు చేస్తున్నారు.
“ఇది నిజంగా న్యాయమైన మ్యాచ్ అయితే ఇలా మూడు రివ్యూలు ఎలా రివర్స్ అయ్యాయి?”, “అంపైర్లు ఇండియా కోసం పనిచేస్తున్నారా?” వంటి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.