అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs PAK Match | సెప్టెంబర్ 14న జరగనున్న భారత్ vs పాకిస్తాన్(Ind vs PAK) మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో భారత్‌తో ఆడకపోతేనే పాకిస్తాన్‌కు మంచిదని, టీమ్ ఇండియా(Team India)తో తలపడితే తమ జట్టు పరాభవం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.ఇటీవల పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చివరి వన్డేలో కేవలం 92 పరుగులకే ఆలౌట్ కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
IND vs PAK Match | వారితో ఆడలేం..
ఈ నేపథ్యంలో బాసిత్ అలీ(Basit Ali), తన యూట్యూబ్ షో ‘ది గేమ్ ప్లాన్’ లో మాట్లాడుతూ.. “భారత్‌తో ఆడకూడదని ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. ఆడితే వారు మమ్మల్ని చిత్తు చేస్తారు. ఆ తర్వాత పరిణామాలు ఊహించలేని స్థాయిలో ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలు హోస్ట్ నవ్వు పుట్టించేలా చేయగా, బాసిత్ అలీ వెంటనే స్పందిస్తూ,ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ భారత్‌తో ఓడితే మాత్రం దేశమంతా బాగా స్పందిస్తుంది. ప్రజలకే కాదు, ప్లేయర్ల మీదే ఒత్తిడి పెరుగుతుంది అని తెలిపారు.
ఈసారి ఆసియా కప్(Asian Cup) సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో మ్యాచ్ హైపే వేరుగా ఉంది. పాకిస్తాన్ తాత్కాలికంగా టీ20 సిరీస్‌ను విన్నింగ్ మూడ్‌లో ముగించినా, వన్డే సిరీస్‌లో వారి ఫామ్ తీవ్ర నిరాశకు గురి చేసింది.గత మ్యాచ్‌లో పాక్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.సమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, రిజ్వాన్ సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. బాబర్ అజామ్ కేవలం 9 పరుగులే చేశాడు. ఇక భారత్ విషయానికి వస్తే, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేయడంతో పాటు, ఆటగాళ్లు అద్భుతంగా ఫామ్‌లో ఉన్నారు. ఆసియా కప్ కోసం ఒక పటిష్టమైన జట్టు సిద్ధంగా ఉంది. ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్ అని అంచనా వేస్తున్నారు. బాసిత్ అలీ వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్ స్థితి ఎలా ఉందో తెలియజేస్తుంది..