HomeUncategorizedOperation Sindoor | భారత్​ దాడులతో పాక్​కు తీవ్ర నష్టం

Operation Sindoor | భారత్​ దాడులతో పాక్​కు తీవ్ర నష్టం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ తర్వాత ఎల్​వోసీ దగ్గర పాకిస్తాన్​ తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. భారత్​, పాక్​ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సీడీఎంఈ రఘునాయర్​, కల్నల్​ సోఫియా ఖురేషి, వింగ్​ కమాండర్​ వ్యోమికా సింగ్​ శనివారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత్​ దాడుల్లో పాక్​కు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. భారత్​ పాక్​ మిలటరీ బేస్​లను ధ్వంసం చేసిందని తెలిపారు.

Operation Sindoor | మతకల్లోలకు పాక్​ కుట్ర

ఆపరేషన్​ సిందూర్​తో పాక్​ పౌరులకు ఇబ్బందులు కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్​ దాడులు చేసిందని అధికారులు తెలిపారు. పాక్​లోని ప్రార్థన మందిరాలను, పౌరులను లక్ష్యంగా చేసుకోని భారత్​ దాడులు చేయలేదని చెప్పారు. కానీ పాకిస్తాన్​ ఎల్​వోసి వెంబడి సామాన్య పౌరులపై దాడులు చేసిందన్నారు. ఆలయాలు, గురుద్వారాలపై దాడులు చేసి భారత్​లో మతకల్లోలాలు చేయాలని కుట్ర పన్నిందన్నారు.

Operation Sindoor | అసత్య ప్రచారాలు..

భారత్​ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్​.. సోషల్​ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసిందని అధికారులు తెలిపారు. ఎస్​ 400 రక్షణ వ్యవస్థను, ఇండియన్​ ఎయిర్​బేస్​లు, బ్రహ్మోస్​ క్షిపణులను ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. పాక్​ దాడుల్లో భారత్​ ఆర్మీ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. పలువురు సామాన్య పౌరులు, జవాన్లు మృతి చెందినట్లు వివరించారు.

Operation Sindoor | సైన్యం సన్నద్ధంగా ఉంది

భారత సైన్యం పాక్​తో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సర్వం సన్నద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. పాక్​ దాడుల్లో భారత సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొన్నారు. భారత్‌ దాడులతో పాక్‌ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసిందన్నారు.