Ind - Pak | పాక్ ప్ర‌తీకార చ‌ర్య‌లు.. భార‌త నౌక‌ల‌పై నిషేధం
Ind - Pak | పాక్ ప్ర‌తీకార చ‌ర్య‌లు.. భార‌త నౌక‌ల‌పై నిషేధం

అక్షరటుడే, వెబ్ డెస్క్: Ind – Pak | సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌పై Pakistan భార‌త్ India క‌ఠిన చ‌ర్య‌లు strict action చేప‌డుతోంది. ఆ దేశంతో అన్ని ర‌కాల సంబంధాల‌ను తెంచుకుంటోంది. ఈ నేప‌థ్యంలో దాయాది కూడా ప్ర‌తీకార చ‌ర్య‌లకు దిగుతోంది.

పాకిస్తాన్ Pakistan నౌక‌ల‌పై భార‌త్ India శనివారం నిషేధం విధించ‌గా, పొరుగు దేశం కూడా ఆదివారం నుంచి మ‌న నౌక‌ల‌ను నిషేధించింది. భారత జెండా Indian flag క్యారియర్‌లు తన ఓడరేవులను ఉపయోగించకుండా నిషేధించింది. భార‌త నౌక‌లు Indian ships త‌మ పోర్టుల్లోకి రాకుండా చూడాల‌ని ఆదేశించింది.

Ind – Pak | ప్ర‌తీకార చ‌ర్య‌లు..

జమ్మూ కాశ్మీర్‌లోని Jammu and Kashmir పహల్గామ్‌లో Pahalgam 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడి terrorist attack తర్వాత భారత్ దాయాదిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే సింధు జ‌లాల Indus River నిలిపివేత‌, వీసాల ర‌ద్దుతో visas cancellation పాటు తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని ర‌కాల వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. అలాగే, పాకిస్తాన్ నౌకలను Pakistani ships మ‌న ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా భారతదేశం నిషేధించింది. దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ మ‌న నౌక‌ల‌ను అనుమ‌తించ‌బోమ‌ని వెల్ల‌డించింది.

భారత జెండా నౌక‌ల‌ను Indian-flagged ships పాకిస్తాన్‌లోని Pakistan ఏ ఓడరేవులోకి ports కూడా అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. “సముద్ర సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ప్రయోజనాలను. జాతీయ భద్రతను కాపాడటానికి పాకిస్తాన్ Pakistan తక్షణమే త‌గు చర్యలను అమలు చేస్తుంది. భారత జెండా క‌లిగిన క్యారియర్‌లు Indian-flagged carriers పాకిస్తాన్‌లోని ఏ ఓడరేవుకు ports కూడా రాకుండా నిషేధించ‌బ‌డింది. పాకిస్తాన్ నౌక‌లు Pakistani ships భార‌త్‌కు వెళ్ల‌కూడ‌దు. ఏదైనా మినహాయింపు కావాలంటే ముందుగా అనుమ‌తి తీసుకోవాల‌ని సూచించింది.