HomeUncategorizedTrump Nobel Prize | ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాల‌ని పాక్ ప్ర‌తిపాదిన.. రెండు దేశాల మ‌ధ్య...

Trump Nobel Prize | ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాల‌ని పాక్ ప్ర‌తిపాదిన.. రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌ప‌డుతున్న బంధం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Nobel Prize | అమెరికా, పాకిస్తాన్ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోంది. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడే రెండు మోస‌పూరిత దేశాల మ‌ధ్య సంబంధాలు బ‌లోపేతం అవుతుండ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. 2026 నోబెల్ శాంతి బ‌హుమ‌తికి (2026 Nobel Peace Prize) అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను (Donald Trump) నామినేట్ చేస్తున్న‌ట్లు పాకిస్తాన్ తాజాగా ప్ర‌క‌టించింది. ఇటీవలి ఇండియా-పాక్ వివాదంలో ఆయన నిర్ణయాత్మక దౌత్య పాత్ర పోషించార‌ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తెలిపింది. ట్రంప్ జోక్యం రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలకమని పేర్కొంది. అయితే, ఈ వాదనను భారత్ స్పష్టంగా తోసిపుచ్చింది. కాల్పుల విరమణ కోసం ఇస్లామాబాద్ (Islamabad) న్యూఢిల్లీని సంప్రదించిందని, ఇది రెండు దేశాల మధ్య మాత్రమే జ‌రిగిన అంగీకార‌మ‌ని, ట్రంప్ లేదా అమెరికాకు ఎటువంటి పాత్ర లేదని ఇండియా వెల్ల‌డించింది. ఈ వారం ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (Prime Minister Narendra Modi) ఫోన్ కాల్ సందర్భంగా ట్రంప్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.

Trump Nobel Prize | ట్రంప్ సొంత డ‌బ్బా

ఏం జ‌రిగినా దాన్ని సొంత ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం, వివాదాలను తగ్గించడంలో తానే కీల‌క పాత్ర పోషించాన‌ని చెప్పుకోవ‌డం ట్రంప్‌కు అల‌వాటుగా మారింది. ఇండియా, పాక్ (India-Pakistan) మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌ను తానే త‌గ్గించాన‌ని ప‌లుమార్లు చెప్పుకున్నారు. ఈ క్ర‌మంలో తాను సాధించిన విజ‌యాల‌కు నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడని, ఇప్ప‌టికే తాను నాలుగైదు సార్లు దాన్ని పొందాల్సింద‌ని చెప్పారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య శత్రుత్వాన్ని నివారించేందుకు సోమవారం సంతకం చేయబోయే ఒప్పందంపై మధ్యవర్తిత్వం వహించడంలో అతని పాత్ర ఉంది. “నేను దానిని (నోబెల్ శాంతి బ‌హుమ‌తి) (Nobel Peace Prize) నాలుగు లేదా ఐదు సార్లు పొంది ఉండాలి. కానీ వారు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరు ఎందుకంటే వారు దానిని ఉదారవాదులకు మాత్రమే ఇస్తారని” ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) ట్రంప్‌కు నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. ఇటీవ‌ల అమెరికాలో ప‌ర్య‌టించిన ఆయ‌న ట్రంప్ తో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగానే మునీర్ ఆయ‌న‌కు నోబెల్ ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

Must Read
Related News