అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor |పాకిస్తాన్ pakistan తన బుద్ధి మార్చుకోవడం లేదు. నిన్న రాత్రి భారత్‌పై దాడి చేసి విఫలమైన ఆ దేశం తాజాగా నియంత్రణ రేఖ LOC వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం రాత్రి 400 డ్రోన్లతో పాక్ భారత్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పాక్ బలగాలు సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. జైసల్మేర్, యూరి ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దీంతో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పి కొడుతోంది.
