ePaper
More
    Homeఅంతర్జాతీయంIndia - Pakistan | యుద్ధం వస్తే పాక్ దివాళా తీయడం ఖాయమే.. గ్లోబల్ రేటింగ్...

    India – Pakistan | యుద్ధం వస్తే పాక్ దివాళా తీయడం ఖాయమే.. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ స్పష్టీకరణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: India – Pakistan | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్ దివాళా తీయడం ఖాయమని గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ global rating agency Moodys తెలిపింది. అదే సమయంలో భారతదేశ స్థూల ఆర్థిక పరిస్థితులకు economic conditions ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. పహల్గామ్లో Pahalgam పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ Pakistan మద్దతుగల ఉగ్రవాదులు terrorists రెచ్చిపోయిన తరుణంలో భారత్ దాయాదిపై కఠిన చర్యలు strict action తీసుకుంటోంది. పాకిస్తాన్కు Pakistan ప్రాణాధారమైన 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, అన్ని రకాల సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది.

    India – Pakistan | పాక్‌కు కష్టమే..

    భారతదేశంతో india ఉద్రిక్తతలు నిరంతరం పెరగడం పాకిస్తాన్ ఆర్థిక Pakistan economy వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్ Moody’s తెలిపింది. అలాగే, ఇదే జరిగితే ఆర్థికంగా మనుగడ సాగించడం ఇబ్బందికరమేనని పేర్కొంది. “భారతదేశంతో ఉద్రిక్తతలు నిరంతరం పెరగడం పాకిస్తాన్ వృద్ధిపై Pakistan growth ప్రభావం చూపుతుంది. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో పాకిస్తాన్ పురోగతిని దెబ్బతీస్తుంది. ఇప్పడిప్పుడే పాకిస్తాన్ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వృద్ధి క్రమంగా పెరుగుతోంది, ద్రవ్యోల్బణం తగ్గుతోంది. IMF కార్యక్రమంలో నిరంతర పురోగతి మధ్య విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయి. కానీ, ప్రస్తుత ఉద్రిక్తతలు పెరుగడం పాకిస్తాన్కు Pakistan బయటి నుంచి వచ్చే నిధులపై funds ప్రభావం చూపుతుంది. అలాగే, విదేశీ మారక ద్రవ్య foreign exchange నిల్వలపై ఒత్తిడి తెస్తుంది. ” అని మూడీస్ తెలిపింది.

    India – Pakistan | భారత్‌కు ఇబ్బందేమీ ఉండదు..

    మరోవైపు, భారతదేశ స్థూల ఆర్థిక పరిస్థితులు economic conditions స్థిరంగా ఉన్నాయని, పాకిస్తాన్తో Pakistan ఉద్రిక్తతలు పెద్దగా ప్రభావం చూపవని మూడీస్ moodys తెలిపింది. అయితే అధిక రక్షణ వ్యయం భారతదేశ ఆర్థిక india economy బలంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. “తులనాత్మకంగా, భారతదేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు economic conditions స్థిరంగా ఉంటాయి, బలమైన ప్రభుత్వ పెట్టుబడులు, ఆరోగ్యకరమైన ప్రైవేట్ వినియోగం healthy private consumption మధ్య మోడరేట్ అయినప్పటికీ ఇప్పటికీ అధిక స్థాయి వృద్ధి ద్వారా బలోపేతం అవుతాయి. పాక్తో ఉద్రిక్తతలు పెరుగుతున్నా భారత ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద అంతరాయాలు ఉండవు. అయితే, అధిక రక్షణ వ్యయం దేశ ఆర్థిక బలంపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక ఏకీకరణను నెమ్మదిస్తుంది” అని పేర్కొంది. మరోవైపు, రెండు దేశాల మధ్య యుద్ధం జరుగకపోవచ్చని తెలిపింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...