అక్షరటుడే, వెబ్‌డెస్క్: promotion of the Army Chief : భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ తీసుకున్న కీలక నిర్ణయం నవ్వుల పాలైంది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు పదోన్నతి కల్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. యుద్ధం ఓడిపోయినందుకు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారా? లేక ప్రాణభయంతో బంకర్లలో దాక్కున్నందుకు పదోన్నతి ఇచ్చారా? అంటూ నెటిజన్లు(Netizens) తీవ్ర స్థాయిలో పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Pakistan Army Chief General Asim Munir)కు అత్యున్నత పదవి ఫీల్డ్ మార్షల్ హోదా(highest rank of Field Marshal) కల్పిస్తూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం(Shehbaz Sharif government) మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్‌పై ఆ దేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పాక్ ప్రభుత్వ నిర్ణయం అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులపాలు కాగా.. శత్రుదేశం మీద సోషల్ మీడియా(social media)లోనూ జోక్స్ పేలుతున్నాయి.
భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్ సైన్యాన్ని నడిపించడంలో అసిమ్ మునీర్ దారుణంగా విఫలమైనందుకు ప్రమోషన్ ఇచ్చారని నెటిజన్లు ఎద్దేవా చేశారు. దీనికి తోడు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ వ్యవహారాల విషయంలో అసిమ్ మునీర్ పాత్ర లేకపోయినా ఆయనకు ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుందని విమర్శలు గుప్పించారు.
promotion of the Army Chief : పాక్‌పై ట్రోల్స్, మీమ్స్
పాకిస్తాన్ ప్రభుత్వంపై భారత్‌లోనే కాదు, స్వదేశంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఏం సాధించాడని అసిమ్ మునీర్‌కు ఈ పదవి కట్టబెట్టారని నెటిజన్లు ప్రశ్నించారు. పాక్‌కు ఈ జన్మలో బుద్ధి రాదని.. కుక్క తోక వంకర, అది మారదంటూ సెటైర్స్ వేశారు. ఈయనో విఫల మార్షల్ అంటూ అసిమ్ మునీర్‌ను దుయ్యబట్టారు.
ఆర్మీ చీఫ్(Army Chief)తో పాటు అడ్మిరల్ జనరల్(Admiral General), ప్రైమ్ మినిస్టర్(Prime Minister), సుప్రీం కమాండర్(Supreme Commander), చీఫ్ ఎకనామిస్ట్(Chief Economist), ఎలక్షన్ కమిషనర్(Election Commissioner), చీఫ్ ఛాన్స్ లర్(Chief Chancellor).. ఇలా ఆ దేశంలోని అన్ని పోస్టులు ఆయనవేనని ఎద్దేవా చేస్తున్నారు. ఆర్మీని నడిపించడం చేతగాదు గానీ ఈ బిల్డప్‌లకు ఏమీ తక్కువ లేదని మండిపడ్డారు. భారత డ్రోన్లు, మిసైళ్ల దెబ్బకు పాకిస్థాన్‌కు మైండ్‌బ్లాంక్ అయిందని, అందుకే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.