HomeUncategorizedIndigo Flight | పాకిస్తాన్‌ది ఎంత‌టి మూర్ఖ‌త్వం.. వారి వ‌ల‌న 220 మందికి పైగా ప్రాణాలు...

Indigo Flight | పాకిస్తాన్‌ది ఎంత‌టి మూర్ఖ‌త్వం.. వారి వ‌ల‌న 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయే వారు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | దాయాది దేశం Pakistan మ‌న‌మీద ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటుంది. ముష్క‌రుల‌ని పెంచి పోషిస్తున్న ఆ దేశం ఏదో రోజు మూల్యం చెల్లించుకుంటుంది. అయితే ఇటీవ‌ల భార‌త్-పాక్ మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కాల్పుల విర‌మ‌ణ అమ‌లులో ఉంది. అయితే వాణిజ్య ప‌రంగా పాక్‌ని దెబ్బ‌కొట్టేందుకు భార‌త్(India) ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే ఉంది. అందుకే మ‌న‌మీద అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉంటారు. అయితే ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ విమానయాన సంస్థకు సహాయం చేయడానికి పాకిస్తాన్ నిరాకరించింది. బుధవారం నాడు ఇండిగో విమానం సహాయం కోరింది. వారు నిరాక‌రించిన‌ట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

Indigo Flight | పాక్ తిర‌స్క‌ర‌ణ‌..

220కి మందికి పైగా ప్ర‌యాణికుల‌తో ఢిల్లీ నుంచి శ్రీనగర్(Sri Nagar) వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ప్రతికూల వాతావరణం(Weather) కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్(Pilot) చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పాకిస్థాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో, అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. దీంతో విమానం Aeroplane గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు.

సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air traffic control)ను సంప్రదించి, తుఫాను నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే, పాకిస్థాన్ ఏటీసీ అధికారులు(ATC Officers) ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనుమతి లభించకపోవడంతో, బలమైన గాలులు, వడగళ్ల తుఫాను ఎదుర్కొన్న అదే మార్గంలో విమానం ముందుకు సాగాల్సి వచ్చిందని వర్గాలు తెలిపాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత దృష్ట్యా, పొరుగు దేశం భారత విమానయాన సంస్థ(Indian Airlines)లకు తన గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలకు భారతదేశం తన గగనతలాన్ని కూడా మూసివేసింది. అయితే ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు Srinagar వెళ్లిన తమ విమానం 6E 2142 ఆకస్మిక వడగళ్ల తుఫానును తప్పించుకుని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.