అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Indian Soldier | పాకిస్తాన్(Pakistan) తన చేతిలో బంధీగా ఉన్న భారత జవాన్‌ను అప్పగించింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటకులపై దాడి చేసి 26 మందిని చంపేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 23న బీఎస్‌ఎఫ్ జవాన్(BSF Soldier) పూర్ణమ్ కుమార్ షా వాఘా బోర్డర్ సమీపంలో పొరపాటున సరిహద్దు దాటారు. దీంతో పాక్ రేంజర్లు ఆయనను పట్టుకున్నారు.పీకే షా విడుదల కోసం భారత్, పాకిస్తాన్ చర్చలు జరిపింది. దీంతో బుధవారం ఉదయం 10:30 గంటలకు పీకే షాను పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. అమృత్‌సర్‌లోని అటారి బోర్డర్ వద్ద మన జవాన్‌ను పాక్ అధికారులు అప్పగించారు. జవాన్ అప్పగింత ప్రక్రియ ప్రొటోకాల్ ప్రకారం శాంతియుతంగా సాగిందని బీఎస్‌ఎఫ్(BSF) తెలిపింది.
