HomeUncategorizedHafiz Saeed | భార‌త్ దాడి చేస్తుంద‌నే భ‌యం.. హ‌ఫీజ్ స‌యీద్‌కు భ‌ద్ర‌త పెంపు

Hafiz Saeed | భార‌త్ దాడి చేస్తుంద‌నే భ‌యం.. హ‌ఫీజ్ స‌యీద్‌కు భ‌ద్ర‌త పెంపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ముంబై పేలుళ్ల(Mumbai blasts) కీల‌క సూత్ర‌ధారి, ల‌ష్క‌రే తొయిబా(ఎల్ఈటీ) చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్ (Hafiz Saeed) భ‌ద్ర‌తను పాకిస్తాన్ ప్ర‌భుత్వం (Pakistan government) మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది.

ప్ర‌త్యేక కమాండోల‌ను(Special Commandos) మోహ‌రించింది. జ‌మ్మూకశ్మీర్‌లోని ప‌హ‌ల్​గామ్‌(Pahalgam)లో 26 మంది అమాయ‌కుల‌ను ప్రాణాల‌ను ఉగ్రవాదులు బ‌లిగొన్న నేప‌థ్యంలో భార‌త్ త‌మ‌పై దాడి చేస్తుంద‌ని పాక్ భ‌య‌ప‌డుతోంది. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లోని టెర్ర‌రిస్టు క్యాంపుల్లో(Terrorist camps) ఉన్న ఉగ్రవాదుల‌ను ఇప్ప‌టికే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది. ఇక‌, ముంబై పేలుళ్లు స‌హా ఎన్న ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డిన కీలక నిందితుడు, ల‌ష్క‌రే చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌కు భ‌ద్ర‌త‌ను పెంచింది.

Hafiz Saeed | మాజీ కమాండోల‌తో భ‌ద్ర‌త‌..

77 ఏళ్ల హ‌ఫీజ్ రక్షణ కోసం పాకిస్తాన్ త‌న స్పెషల్ సర్వీస్ గ్రూప్(ఎస్ఎస్‌జీ)కి చెందిన మాజీ కమాండోల‌ను మోహ‌రించింది. లాహోర్‌లోని మొహల్లా జోహార్ లోని హ‌ఫీజ్ ఇంటితో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న అత‌ని నివాసాల వ‌ద్ద అద‌న‌పు సిబ్బందిని కేటాయించింది. అలాగే, ఆయా నివాసాల చుట్టూ కిలోమీట‌ర్ వ‌ర‌కు సీసీ కెమోరాలు ఏర్పాటు చేసి వ‌చ్చిపోయే వారిని ట్రాక్ చేస్తున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించారు. వాస్త‌వానికి హ‌ఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసి, జైలులో పెట్టామ‌ని పాకిస్తాన్ బాహ్య ప్ర‌పంచానికి చెప్తుంది. అత‌ని ఇల్లును తాత్కాలికంగా జైలుగా మార్చిన‌ట్లు చెబుతారు. కానీ అతడు మాత్రం ఆ దేశంలో స్వేచ్ఛ‌గా తిరుగుతుంటాడు, ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తూ భార‌త్‌పై దాడుల‌కు ఉసిగొల్పుతుంటాడు. ఏప్రిల్ 22 న పహల్గామ్ బైసరాన్ వ్యాలీ(Bysaran Valley)లో జ‌రిగిన ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ నియంత్రణలో పనిచేసే ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.