ePaper
More
    Homeఅంతర్జాతీయంIndia | ఇక పాక్​ ఆటలు సాగవు.. జామర్లను మోహరించిన భారత్​

    India | ఇక పాక్​ ఆటలు సాగవు.. జామర్లను మోహరించిన భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :India | పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్​ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్(Pakistan)​ ఉందని ఇప్పటికే ఆ దేశానికి సింధు జలాలను(Indus River) భారత్ ఆపేసింది.

    మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) నిత్యం రక్షణ, హోం శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించాయి. భారత్​ దాడి చేస్తే తాము ఎదురు దాడి చేస్తామని పాకిస్తాన్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

    India | విమానాలు రాకుండా..

    భారత్​ దాడి చేస్తే పాకిస్తాన్​ యుద్ధ విమానాలు భారత్​పై దాడి చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్​ కీలక జామర్​ వ్యవస్థ(Jammer system)ను సరిహద్దులో మోహరించింది. పాక్‌ మిలిటరీ విమానాలు(Pak military aircraft) లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌(Electronic warfare) వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇది పాక్​ యుద్ధ విమనాలు వినియోగించే జీపీఎస్(GPS), గ్లోనాస్(GLONASS)​, బైడూస్​(Baidus)లను అడ్డుకుంటుంది. దీంతో ఆ విమానాలు లక్ష్యాలను గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. పాక్​ విమానాలతో పాటు, డ్రోన్లు(Drones), గైడెడ్‌ మిసైల్స్‌(Guided Missiles) భారత్‌లో లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయి.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...