ePaper
More
    Homeఅంతర్జాతీయంCIA Document | భార‌త్‌తో యుద్ధ‌మంటే పాక్‌కు భ‌య‌మే.. వెల్ల‌డించిన సీఐఏ ప‌త్రాలు..

    CIA Document | భార‌త్‌తో యుద్ధ‌మంటే పాక్‌కు భ‌య‌మే.. వెల్ల‌డించిన సీఐఏ ప‌త్రాలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CIA Document | జ‌మ్మూకాశ్మీర్‌లోని పహల్​గామ్​ దాడి(Pahalgam attack) తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధ భ‌యాలు నెల‌కొన్న త‌రుణంలో భారత్(India) చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ నేతలు(Pakistan Leaders) నోటి దురుసు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అయితే, భార‌త్‌తో యుద్ధ‌మంటే పాకిస్తాన్‌కు వెన్నులో వ‌ణుకు అని అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ(CIA) వెల్ల‌డించింది. భారత్‌, పాక్ మధ్య యుద్ధం అంటూ జరిగితే అది కశ్మీర్ వల్లేనని 1993లో సీఐఏ అధికారిగా ప‌ని చేసిన‌ బ్రూస్ రైడెల్(Bruce Rydell) పేర్కొన్నారు. నాటి బాబ్రీ మసీదు(Babri Masjid) కూల్చివేత నేపథ్యంలో భారత్, పాక్ ఉద్రిక్తతలపై ఆయన ఓ నివేదిక సిద్ధం చేశారు. ఆ ర‌హ‌స్య నివేదికలో పాక్‌ అభద్రత, భయాలను పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ డాక్యుమెంట్ సంచలనంగా మారింది.

    CIA Document | భ‌యాందోళ‌న‌లో పాక్‌..

    ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా ఉన్న భారత్‌(India)ను చూసి పాక్ తీవ్రంగా భయప‌డుతోందని నివేదిక వెల్ల‌డించింది. బలమైన భారత్‌ తన ఉనికికే ముప్పు అని పాక్(Pakistan) భావిస్తున్నట్టు పేర్కొంది. వేగంగా ఎదుగుతున్న భారత్‌ను చూసి భయానికి గురైన స్థితిలో పాక్‌ యుద్ధానికి దిగే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు అంచనా, రెచ్చగొట్టే చర్యలు, ప్రతిదాడులు.. భారీ ఉగ్రదాడి వంటివి పాక్, భారత్ యుద్ధానికి దారి తీయొచ్చని బ్రూస్(Bruce) అప్ప‌ట్లోనే భావించారు. ఇందుకు కశ్మీర్ పరిస్థితులు కారణం కావొచ్చని కూడా అన్నారు.

    CIA Document | ఉగ్ర‌వాదుల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మే పాక్ వ్యూహం

    భారత్‌పై ఉగ్రమూకలను రెచ్చగొట్టడమే పాక్ ప్రధాన వ్యూహమని కూడా సీఐఏ(CIA) నివేదిక వెల్ల‌డించింది. అంతర్గత కుమ్ములాటలతో దేశం అస్థిరంగా మారిన పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకు పాక్ ప్రభుత్వం(Pakistan government) ఇస్లామిక్ పాలన వైపు కూడా మళ్లే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ప్రయోగ భయాలు ఉన్నాయ‌ని పేర్కొంది. అయితే, పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పరస్పర విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని, నేరుగా చర్చల కోసం హాట్‌లైన్(Hotline) ఏర్పాటుతో పాటు అణ్వాయుధాలపై ఒప్పందం అవసరమని సూచించింది.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...