ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan diplomat's espionage | పాక్ దౌత్యాధికారి గూఢ‌చర్యం.. బ‌హిష్క‌రించిన భార‌త్‌

    Pakistan diplomat’s espionage | పాక్ దౌత్యాధికారి గూఢ‌చర్యం.. బ‌హిష్క‌రించిన భార‌త్‌

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan diplomat’s espionage : దౌత్యాధికారి ముసుగులో దేశ ద్రోహానికి పాల్ప‌డుతున్న పాకిస్తాన్ అధికారిని భార‌త్ బుధ‌వారం బ‌హిష్క‌రించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో pakistan high commission పనిచేస్తున్న స‌ద‌రు పాకిస్తాన్ అధికారి.. దౌత్య హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడ‌ని పేర్కొంది. అందుకు గాను ఆయనను పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది.

    ఆ అధికారిని 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. “ఈరోజు పాకిస్తాన్ హైకమిషన్‌కు ఛార్జ్ డి అఫైర్స్ డిమార్చ్ జారీ చేయబడింది. భారతదేశంలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలు లేదా అధికారులు ఎవరూ తమ అధికారాలను, హోదాను ఏ విధంగానూ దుర్వినియోగం చేయకుండా క‌చ్చితంగా చూసుకోవాలని కోరిన‌ట్లు ” విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs) ఓ ప్రకటనలో తెలిపింది.

    Pakistan diplomat’s espionage : ప్రొటోకాల్ కు విరుద్ధంగా కార్య‌క‌లాపాలు..

    ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం(central government) మే 13న న్యూఢిల్లీ(New Delhi)లోని హైకమిషన్ అధికారి(High Commission official)ని “పర్సన నాన్ గ్రాటా”గా ప్రకటించింది, దౌత్య ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. తాజాగా మ‌రో అధికారిని కూడా దేశం నుంచి బ‌హిష్క‌రించింది. భారత సాయుధ దళాల ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని గూఢచర్య నెట్‌వర్క్‌పై కేంద్ర ప్ర‌భుత్వం కఠిన చర్యలు చేప‌ట్టింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra) స‌హా అనేక మందిని అరెస్టు చేసిన తర్వాత ఈ బహిష్కరణ వేటు వేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

    Pakistan diplomat’s espionage : జ్యోతితో హైక‌మిష‌న్‌ సంబంధాలు..

    గూఢ‌చ‌ర్య ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌యిన జ్యోతితో పాకిస్తాన్ హైక‌మిష‌న్ అధికారులు నేరుగా సంబంధాలు కొన‌సాగించిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ‌లు గుర్తించాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాక్ హైక‌మిష‌న్ అధికారిపై వేటు ప‌డిన‌ట్లు తెలిసింది. బహిష్కరణ‌కు గురైన పాకిస్తాన్ అధికారిని అహ్సాన్-ఉర్-రహీం(Ahsan-ur-Rahim) అలియాస్ డానిష్‌గా గుర్తించారు. రహీమ్ గూఢచర్యంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.

    భారత సైన్యం కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అత‌డు లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా 2023లో మొదటిసారి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో అహ్సాన్-ఉర్-రహీమ్‌(Ahsan-ur-Rahim)ను కలిసిందని ద‌ర్యాప్తు అధికారులు గుర్తించారు. అతను జ్యోతికి పాకిస్తాన్ నిఘా కార్యకర్తలను పరిచయం చేశాడ‌ని, భార‌త్‌కు చెందిన సున్నిత‌మైన స‌మాచారాన్ని చేర‌వేశార‌ని అనుమానిస్తున్నారు.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...